జస్ట్ మిస్.. 14 మంది ప్రాణాలు సేఫ్
దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని గరిడేపల్లి మండలం ఎల్బీనగర్లోని జాన్ పహాడ్ మేజర్ కాలువ బ్రిడ్జి వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ వేణు వివరాల ప్రకారం.. మిర్యాలగూడ నుండి సూర్యాపేట వైపు వెళ్తోన్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఎల్బీనగర్కు రాగానే ఫెయిల్ అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఎదురుగా వస్తోన్న వాహనాలను చాకచక్యంగా తప్పించి, […]
దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని గరిడేపల్లి మండలం ఎల్బీనగర్లోని జాన్ పహాడ్ మేజర్ కాలువ బ్రిడ్జి వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ వేణు వివరాల ప్రకారం.. మిర్యాలగూడ నుండి సూర్యాపేట వైపు వెళ్తోన్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఎల్బీనగర్కు రాగానే ఫెయిల్ అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ఎదురుగా వస్తోన్న వాహనాలను చాకచక్యంగా తప్పించి, బస్సు డ్యామేజ్ అయినా.. ప్రయాణికులను రక్షించొచ్చన్న ఆలోచనతో బ్రిడ్జిని గుద్దాడు. ఈ ప్రమాదంలో కండక్టర్ సహా ముగ్గురి ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గరిడేపల్లి ట్రైనీ ఎస్ఐ సతీష్ వర్మ గాయపడిన వారిని నేరేడుచర్ల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సుకు కొంతమేర నష్టం జరిగినా.. ప్రయాణికుల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ను అభినందించారు.