యూకే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో యూకే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం నూతన మర్గదర్శకాలను విడుదల చేసింది. ఆ దేశం నుంచి వచ్చిన ప్రయాణికులందరూ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు తప్పనిసరి చేసుకోవాలని సూచించింది. ఒకేవేళ రూపాంతరం చెందిన వైరస్ సోకితే ప్రత్యేక ఐసోలేషన్, వారితోపాటు ప్రయాణించిన వారు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. యూకేలో కరోనా స్ట్రెయిన కారణంగా నెలకొన్న భయాందోళనలతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. రూపాంతరం చెందిన కరోనా వైరస్ […]
న్యూఢిల్లీ: కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో యూకే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం నూతన మర్గదర్శకాలను విడుదల చేసింది. ఆ దేశం నుంచి వచ్చిన ప్రయాణికులందరూ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు తప్పనిసరి చేసుకోవాలని సూచించింది. ఒకేవేళ రూపాంతరం చెందిన వైరస్ సోకితే ప్రత్యేక ఐసోలేషన్, వారితోపాటు ప్రయాణించిన వారు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. యూకేలో కరోనా స్ట్రెయిన కారణంగా నెలకొన్న భయాందోళనలతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. రూపాంతరం చెందిన కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నదని, ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని యురోపియన్ సెంటర్ ఫర్ డిసిజస్ కంట్రోల్ (ఈసీడీసీ) పేర్కొందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కరోనా వైరస్‌లో 17 రకాల జన్యుమార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త మార్పుల కారణంగా వైరస్ వేగంగా సోకే సామర్థ్యం పెరిగిందని, ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాప్తించే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యలలో గత నాలుగు వారాల( నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు) నుంచి యూకే మీదుగా ప్రయాణించిన వారి కోసం నూతన మార్గదర్శకాలను విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
– యూకే మీదుగా వచ్చిన ప్రయాణికులు గత 14 రోజుల ట్రావెల్ హిస్టరీని వెల్లడించాలి.
– కచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్‌ను సమర్పించాలి.
– యూకే నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేశారు.
– ఒకవేళ ఎవరికైనా కరోనా నిర్ధారణ అయితే, అదీ రూపాంతరం చెందిన వైరసేనా అని విషయం తేల్చడానిక మరో పరీక్ష చేస్తారు.
– పాత కరోనా వైరస్ సోకి ఉంటే ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనలను పాటించాలి.
– కొత్త వైరస్ స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయితే ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రంలో ఉంచి రోజువారీగా చికిత్స అందిస్తారు. 14వ రోజు మరోసారి కరోనా టెస్టు నిర్వహిస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే మళ్లీ పరీక్ష నిర్వహించారు.
– యూకే ప్రయాణికులందరికీ నూతన మార్గదర్శకాలకు సంబంధించిన సమాచారం అందించాలని విమానయానశాఖకు సూచించారు.
– నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్స్‌కు సూచించింది. ఆ సమాచారం వారిని ట్రాక్ చేయడానికి దోహదపడుతుందని పేర్కొంది.