నాగ్‌పూర్ దసరా వేడుకల్లో RSS చీఫ్.. పాకిస్తాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఓటీటీ, మొబైల్ కంటెంట్‌లను తప్పనిసరిగా నియంత్రించాలని డిమాండ్ చేశారు. దేశానికి హాని కలిగించే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో చూపించే కంటెంట్‌పై నియంత్రణ లేదని భగవత్ చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తర్వాత దాదాపు ప్రతీ వారికి మొబైల్ ఫోన్ ఉందని, వారు సెల్ ఫోన్లలో చూసేది నియంత్రించాలని […]
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఓటీటీ, మొబైల్ కంటెంట్‌లను తప్పనిసరిగా నియంత్రించాలని డిమాండ్ చేశారు. దేశానికి హాని కలిగించే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో చూపించే కంటెంట్‌పై నియంత్రణ లేదని భగవత్ చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తర్వాత దాదాపు ప్రతీ వారికి మొబైల్ ఫోన్ ఉందని, వారు సెల్ ఫోన్లలో చూసేది నియంత్రించాలని భగవత్ సూచించారు. భారతదేశంలో డ్రగ్స్ వాడకం కూడా పెరుగుతోందని భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ తుపాకుల వినియోగంపై శిక్షణ ఇచ్చి, సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులను పంపించి టెర్రర్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని భగవత్ చెప్పారు.