బిగ్‌బ్రేకింగ్ : దోచుకున్నది మొత్తం కక్కిస్తా.. RS ప్రవీణ్ కుమార్ వార్నింగ్

దిశ, వెబ్‌డెస్క్ : బీఎస్పీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హన్మకొండలో జరిగిన బీఎస్పీ ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలకులు దోచుకున్న మొత్తాన్ని గల్లా పట్టుకుని మరీ వసూలు చేస్తామన్నారు. ఆ మొత్తాన్ని విద్య, ఉపాధి, వైద్యం కోసం ఖర్చుచేస్తామన్నారు. మేం అంబేద్కర్, కాన్షీరాం వారసులం అని చెప్పారు. మా రక్తంలో […]

Update: 2021-08-24 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బీఎస్పీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హన్మకొండలో జరిగిన బీఎస్పీ ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలకులు దోచుకున్న మొత్తాన్ని గల్లా పట్టుకుని మరీ వసూలు చేస్తామన్నారు. ఆ మొత్తాన్ని విద్య, ఉపాధి, వైద్యం కోసం ఖర్చుచేస్తామన్నారు. మేం అంబేద్కర్, కాన్షీరాం వారసులం అని చెప్పారు. మా రక్తంలో మాట తప్పడం, మడమ తిప్పే లక్షణం లేదన్నారు. భవిష్యత్‌లో బీసీ, ఎస్టీ, ఎస్సీ బిడ్డలే పాలకులు అవుతారని.. తెలంగాణ అంతా నీలి మయం కావాలని ఆకాక్షించారు.

Tags:    

Similar News