బజ్జీలు వేసిన RS ప్రవీణ్ కుమార్

దిశ, పాలేరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి వస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెంలో మంగళవారం స్వేరోస్ సభ్యులు ఘన స్వాగతం పలికారు .కూసుమంచి మండల కమిటీ అధ్యక్షుడు రాంబాబు స్వేరోస్ సభ్యులు ఆయనకు శాలువా కప్పి, పూలమాల వేసి సత్కరించారు. అనంతరం నాయకన్ గూడెంలో అంబేద్కర్ విగ్రహానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాలవేసి నివాళ్ళర్పించారు. జై భీమ్ అంటూ […]

Update: 2021-08-03 10:57 GMT

దిశ, పాలేరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి వస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెంలో మంగళవారం స్వేరోస్ సభ్యులు ఘన స్వాగతం పలికారు .కూసుమంచి మండల కమిటీ అధ్యక్షుడు రాంబాబు స్వేరోస్ సభ్యులు ఆయనకు శాలువా కప్పి, పూలమాల వేసి సత్కరించారు. అనంతరం నాయకన్ గూడెంలో అంబేద్కర్ విగ్రహానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాలవేసి నివాళ్ళర్పించారు. జై భీమ్ అంటూ నినాదం చేశారు. ఈ సందర్భంగా స్వేరోస్ అధ్యక్షులతో మాట్లాడుతూ.. కూసుమంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కుసుమంచిలోని అంబేద్కర్ విగ్రహం తొలగించడంపై చర్చించారు.

త్వరలోనే ఏర్పాటు చేసేందుకు సన్నదం కావాలని సూచించారు. అక్కడే రహదారి పక్కన బజ్జీల బండి నడుపుకుంటూ జీవనం కొనగిస్తున్న వారి స్థితిగతులు తెలుసుకొని, స్వయంగా బజ్జీలు వేశారు. పేదల కష్టాన్ని దగ్గరగా చూసి చలించిపోయారు. దయచేసి మీ ఇంట్లో ఉన్న పిల్లలని చక్కగా చదివించాలని బజ్జీల బండి నడుపుకుంటున్న కుటుంబానికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ మండల అధ్యక్షులు మోదుగు రాంబాబు, ప్రధాన కార్యదర్శి మట్టె దేవేందర్, స్వేరోస్ కమిటీ జిల్లా, మండలాల సభ్యులు, బహుజన్ సమాజ్వాది పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News