పరిధి దాటి మాట్లాడుతున్నవ్.. సిద్దిపేట కలెక్టర్‌పై RS ప్రవీణ్ కుమార్ సీరియస్

దిశ, మెదక్: వరిధాన్యం వేయొద్దని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. మంగళవారం మెదక్‌ పట్టణ కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పరిధికి మించి మాట్లాడుతున్నాడని, ఆయన ఒకసారి పునరాలోచించుకోవాలి సూచించారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అనంతసాగర్ లాంటి ప్రాజెక్టులు నిర్మించి పుష్కలమైన నీరు రైతులకు ఉన్న సమయంలో వరి వద్దంటే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. […]

Update: 2021-10-26 04:11 GMT

దిశ, మెదక్: వరిధాన్యం వేయొద్దని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. మంగళవారం మెదక్‌ పట్టణ కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పరిధికి మించి మాట్లాడుతున్నాడని, ఆయన ఒకసారి పునరాలోచించుకోవాలి సూచించారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అనంతసాగర్ లాంటి ప్రాజెక్టులు నిర్మించి పుష్కలమైన నీరు రైతులకు ఉన్న సమయంలో వరి వద్దంటే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కోట్ల రూపాయలతో కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతీ సంవత్సరం మూడు వేల నుంచి నాలుగు వేల కరెంటు బిల్లులు కడుతూ ఇప్పుడు వరి వేయకూడదు అంటే రైతుల నోట్లో మట్టి వేసే చర్యగా దీన్ని భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధరలు చూపించకుండా, వరి వేయకూడదు అనే ఆలోచనను ప్రభుత్వం పునరాలోచించుకోవాలన్నారు. ఇప్పటివరకు చెరుకు మిల్లులు లేవని, మక్కల పరిస్థితి దారుణంగా ఉందని, పత్తికి అధిక డిమాండ్ ఉన్నప్పటికీ జిన్నింగ్ మిల్లులు లేవని రాష్ట్రంలో ఫుడ్ పరిశ్రమ లేవని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాగుకోసం ఫామ్ హౌస్‌లో 365 రోజులు నీళ్లు ఉండేలా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును కట్టించుకున్నారు. కరీంనగర్ ముంపు గ్రామాల్లో వందలాది ఎకరాలు మునిగిపోయాయని, ఇప్పటివరకు నష్టపరిహారం రాలేదన్నారు. ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు అల్లారం రత్నయ్య, మాజీ మావోయిస్టు భూదక్క, శాంతి కుమార్, లక్ష్మి, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News