బరిలోకి పందెం కోళ్లు.. దేనికైనా రె ‘ఢీ’
దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలో పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. ఎక్కడిక్కడ టెంట్లు వేసి మరి పందెం రాయుళ్లు బరులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని చూసేందుకు పురుషులతో పాటు మహిళలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రీడా నిర్వహించడం చట్ట విరుద్ధమని తెలిసినా అడ్డుకునేందుకు ఆ చుట్టు పక్కలకు కూడా పోలీసులు రావడం లేదు. కారణం వాటిని నిర్వహణలో ప్రజాప్రతినిధుల హస్తం […]
దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలో పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. ఎక్కడిక్కడ టెంట్లు వేసి మరి పందెం రాయుళ్లు బరులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని చూసేందుకు పురుషులతో పాటు మహిళలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి.
ఈ క్రీడా నిర్వహించడం చట్ట విరుద్ధమని తెలిసినా అడ్డుకునేందుకు ఆ చుట్టు పక్కలకు కూడా పోలీసులు రావడం లేదు. కారణం వాటిని నిర్వహణలో ప్రజాప్రతినిధుల హస్తం ఉండటమే అని తెలుస్తోంది. ప్రతియేడు లాగే ఈసారి సంక్రాంతి పండుగకు నిర్వహించే కోడి పందేళ్లో రూ. కోట్లు చేతులు మారుతున్నాయి. ఏడాడికొకసారి వచ్చే పండుగ కోసం దేనికైనా రె‘ఢీ’ అని పందెం రాయుళ్లు తమ కోడిపుంజులను బరిలోకి దించుతున్నారు.