ఆ పని చేసిన జంటను పట్టించిన కెమెరా

దిశ వెబ్‎డెస్క్: హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో ఏటీఎంలో భారీ దోపిడీ జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలోని అంబాలా-ఢిల్లీ నేషనల్ హైవేపై ఉన్న ఎస్‎బీఐ ఏటీఎం నుంచి రూ.9.13 లక్షలు దోచుకున్నారు దుండగులు. ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలను పనిచేయకుండా చేసి, గ్యాస్ కట్టర్ ద్వారా యంత్రాన్ని ధ్వంసం చేసి దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీను పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి లోపలికి వెళ్లినట్లు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ రామ్ కుమార్ […]

Update: 2020-09-02 09:20 GMT

దిశ వెబ్‎డెస్క్: హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో ఏటీఎంలో భారీ దోపిడీ జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలోని అంబాలా-ఢిల్లీ నేషనల్ హైవేపై ఉన్న ఎస్‎బీఐ ఏటీఎం నుంచి రూ.9.13 లక్షలు దోచుకున్నారు దుండగులు. ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలను పనిచేయకుండా చేసి, గ్యాస్ కట్టర్ ద్వారా యంత్రాన్ని ధ్వంసం చేసి దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీను పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి లోపలికి వెళ్లినట్లు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ రామ్ కుమార్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News