బీజాపూర్‌లో హై అలర్ట్.. 76 మంది జవాన్లను హతమార్చిన మావోయిస్టు అరెస్టు

దిశ, వాజేడు : తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో రూ. 8 లక్షల నగదు రివార్డు కలిగిన మావోయిస్ట్ నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని సంవత్సరాల కిందట సుక్మా జిల్లాలో 76 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని అంబుష్‌లో బంధించి చంపిన నక్సలైట్‌‌ను అరెస్టు చేయడంలో ఎట్టకేలకు బీజాపూర్ జిల్లా పోలీసులు విజయం సాధించారు. దీంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం […]

Update: 2021-09-13 22:57 GMT

దిశ, వాజేడు : తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో రూ. 8 లక్షల నగదు రివార్డు కలిగిన మావోయిస్ట్ నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని సంవత్సరాల కిందట సుక్మా జిల్లాలో 76 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని అంబుష్‌లో బంధించి చంపిన నక్సలైట్‌‌ను అరెస్టు చేయడంలో ఎట్టకేలకు బీజాపూర్ జిల్లా పోలీసులు విజయం సాధించారు.

దీంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టుపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. అరెస్టైన నక్సలైట్ పేరు మోతిరామ్ అవలం. బీజాపూర్, సుక్మా జిల్లాల్లో వివిధ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. మోతిరామ్ పై పలు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.

Tags:    

Similar News