చిన్న సంస్థలకు ఆదాయపు పన్ను వాపసు!
దిశ, వెబ్‌డెస్క్: చిన్న వ్యాపారులకు రూ. 5,204 కోట్ల ఆదాయపు పన్ను వాపసు ఇచ్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి యజమానులు, కార్పొరేట్, ట్రస్టులు సహా సుమారు 8 లక్షల చిన్న వ్యాపారులకు ఈ వాపసు జారీ చేసినట్లు సీబీడీటీ స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రభావానికి గురైన పన్ను చెల్లింపు దారులకు సహాయం చేసేందుకే ప్రభుత్వం వాపసు ఇవ్వాలని నిర్ణయించినట్టు, ఐటీ శాఖ ఒక్కో సంస్థకు రూ. 5 లక్షల […]
దిశ, వెబ్‌డెస్క్: చిన్న వ్యాపారులకు రూ. 5,204 కోట్ల ఆదాయపు పన్ను వాపసు ఇచ్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి యజమానులు, కార్పొరేట్, ట్రస్టులు సహా సుమారు 8 లక్షల చిన్న వ్యాపారులకు ఈ వాపసు జారీ చేసినట్లు సీబీడీటీ స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రభావానికి గురైన పన్ను చెల్లింపు దారులకు సహాయం చేసేందుకే ప్రభుత్వం వాపసు ఇవ్వాలని నిర్ణయించినట్టు, ఐటీ శాఖ ఒక్కో సంస్థకు రూ. 5 లక్షల వరకూ దాదాపు 14 లక్షల వాపసులను జారీ చేసిందని సీబీడీటీ పేర్కొంది. ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి ఉపశమనం కలిగించే ప్రయత్నంలో సీబీడీటీ చిన్న వ్యాపారులకు రూ. 7,760 కోట్ల పన్ను వాపసులను ఇవ్వనుంది. సీబీడీటీ ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా సంబంధిత వర్గాలు స్పందించాలంటూ కోరింది. వారంలోపు స్పందించాలని తద్వారా పన్ను వాపసుల ప్రాసెస్ చేపడతామని తెలిపింది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం దీర్ఘకాలిక రీఫైనాన్సింగ్ కార్యాకలాపాలకు రూ. 50 వేల కోట్లను ప్రకటించారు. చిన్న, మధ్య తరహా కార్పొరేట్‌లు, బ్యాంకింగ్ రహిత ఆర్థిక సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు తగినంత ద్రవ్య లభ్యత అందించనున్నట్టు వెల్లడించారు.
Tags: income tax refunds, CBDT, IT, MSME sector