కోడి పందాల మార్కెట్ @రూ.500 కోట్లు

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి కోడి పందాల బరుల్లో మహిళలు సైతం చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలు రాత్రింబవళ్లు హోరెత్తించాయి. కరోనా నిబంధనలు, పోలీసుల హెచ్చరికలను సైతం కాదని పందెం రాయుళ్లు బరిలోకి దూకారు.అయితే, ఈసారి పండుగకు సుమారు రూ.500 కోట్ల మేర బెట్టింగ్ మనీ చేతులు మారినట్లు తెలుస్తోంది. […]

Update: 2021-01-15 00:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి కోడి పందాల బరుల్లో మహిళలు సైతం చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలు రాత్రింబవళ్లు హోరెత్తించాయి. కరోనా నిబంధనలు, పోలీసుల హెచ్చరికలను సైతం కాదని పందెం రాయుళ్లు బరిలోకి దూకారు.అయితే, ఈసారి పండుగకు సుమారు రూ.500 కోట్ల మేర బెట్టింగ్ మనీ చేతులు మారినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా, ప్రతియేటా ఉభయగోదావరి జిల్లాలో సాగే ఈ క్రీడలు కొత్త ప్రాంతాలకు విస్తరించాయి. ఈ సారి గుంటూరు,కృష్ణా ప్రాంతాల్లోనూ కోడి పందాలు జోరందుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇదంతా ఒకవైపయితే ఎన్నడూ లేని విధంగా పురుషులతో సమానంగా మహిళలు సైతం కోడి పందాలపై ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం కోడి పందాల బరులు ఉన్న ప్రాంతాలు మొత్తం జాతరను తలపిస్తున్నాయి. సంక్రాంతిలో భాగమైన కనుమ చివరి రోజు కావడంతో ఇవాళ కూడా పందెం రాయుళ్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో ఇవాళ్టి కోడి పందాల్లో మరింత డబ్బు చేతులు మారే అవకాశం కనిపిస్తోంది.

\

Tags:    

Similar News