FPIs: రూ. 1 లక్ష కోట్ల మార్కు దాటిన ఎఫ్‌పీఐలు

సెప్టెంబర్‌లో ఏకంగా తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా రూ. 57,359 కోట్లను మన ఈక్విటీల్లో కుమ్మరించారు.

Update: 2024-09-29 19:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏకంగా తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా రూ. 57,359 కోట్లను మన ఈక్విటీల్లో కుమ్మరించారు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడంతో విదేశీ మదుపర్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులకు అసక్తి చూపిస్తున్నారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. ఈ మొత్తంతో ఈక్విటీల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు 2024లో రూ. లక్ష కోట్ల మార్కును దాటాయని గణాంకాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో భారత్ లాంటి బలమైన వృద్ధిని కలిగిన భారత్ లాంటి దేశల్లో విదేశీ పెట్టుబడులు పుంజుకుంటున్నాయని రీసెర్చ్ అనలిస్ట్ సంస్థ గోల్‌ఫై సీఈఓ రాబిన్ ఆర్య చెప్పారు. ముఖ్యంగా దేశంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండటం, లిక్విడిటీ కోసం ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలు బలంగా ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. 

Tags:    

Similar News