చిట్టీల పేరిట రూ.5 కోట్ల మోసం
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగరానికి చెందిన కాచం కిరణ్ కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ రూ.5కోట్లకు ఎగనామం పెట్టాడు. బాధితులు నజీర్ అహ్మద్, పసునూరి విజయలక్ష్మీ, దాచేపల్లి ప్రకాశ్‌లు రూ.76లక్షలు మోసపోయినట్టుగా మార్చి 12వ తేదీన సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కాచం కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా దాదాపు రూ.5 కోట్లకు పైగా మోసం చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. గురువారం నిందితుడిని అరెస్ట్ […]
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగరానికి చెందిన కాచం కిరణ్ కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ రూ.5కోట్లకు ఎగనామం పెట్టాడు. బాధితులు నజీర్ అహ్మద్, పసునూరి విజయలక్ష్మీ, దాచేపల్లి ప్రకాశ్‌లు రూ.76లక్షలు మోసపోయినట్టుగా మార్చి 12వ తేదీన సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కాచం కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా దాదాపు రూ.5 కోట్లకు పైగా మోసం చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. గురువారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.