కరోనా దెబ్బకు ‘కలర్ ఫుల్ సీన్స్’ మిస్సింగ్.. రూ.25వేల కోట్ల నష్టం
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా రక్కసి మళ్లీ పంజా విసురుతోంది. దీనికి తోడు యూకేకు చెందిన స్ట్రెయిన్ వైరస్ కూడా విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. భారత్‌లోనూ కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసుల నమోదులో ఏ మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. జనవరి-2021 తర్వాత కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను స్వీడ్ అప్ […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా రక్కసి మళ్లీ పంజా విసురుతోంది. దీనికి తోడు యూకేకు చెందిన స్ట్రెయిన్ వైరస్ కూడా విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. భారత్‌లోనూ కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసుల నమోదులో ఏ మాత్రం తగ్గుదల కనిపించడం లేదు.
జనవరి-2021 తర్వాత కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను స్వీడ్ అప్ చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. మొన్నటివరకు 60ఏళ్ల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వగా.. తాజాగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా ఇవ్వాలని కేంద్రహోంశాఖ ఆదేశించింది.దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో రాత్రివేళ నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆదే ఆర్థిక రాజధానిలో కరోనా కేసుల సంఖ్య డిసెంబర్‌కు ముందున్న పరిస్థితిని తలపిస్తోంది. ఒక్కరోజులోనే 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో ఇతర రాష్ట్రాలు సైతం అలెర్ట్ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే హోలి(కలర్ ఫెస్ట్)పై సుమారు 7రాష్టాలు ఆంక్షలు విధించాయి. పబ్లిక్‌గా హోలి వేడుకలు నిర్వహించుకోవద్దని.. ఇంట్లోనే జరుపుకోవాలని నిబంధనలు విధించారు. ఈ ప్రభావం రంగుల వ్యాపారంపై తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది. ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా ప్రకారం సుమారు రూ.25,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేల్చింది. గతేడాది 2020లో రూ.20,000 కోట్లను కోల్పోగా.. వరుసగా రెండో ఏడాదిలోనూ హోలీపై ఆంక్షలు విధించడంతో దాని విలువ మరింత పెరిగినట్లు సమాచారం. మమూలుగా ప్రతిఏడాది 40,000 హోలి సమావేశాలు జరుగుతాయని CAIT సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.