జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. రూ.17.50 కోట్లు విడుదల
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.17.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్‌లో భాగంగా ఇప్పటికే రూ. 34.50 కోట్లు మంజూరు కాగా, గురువారం మరో రూ.17.50 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ నిధిలో ఇప్పటి వరకు రూ.52 […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.17.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్‌లో భాగంగా ఇప్పటికే రూ. 34.50 కోట్లు మంజూరు కాగా, గురువారం మరో రూ.17.50 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ నిధిలో ఇప్పటి వరకు రూ.52 కోట్లు జమైనట్లు తెలిపారు. ఈ నిధులతో జర్నలిస్టులకు సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నిధులు రాబట్టడానికి కృషి చేసిన ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 7వ తేదీన జల విహార్‌లో జర్నలిస్టుల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సంక్షేమ నిధి కింద ఎంపికైన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నట్లు చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.