ఫ్లాష్ ఫ్లాష్ : ఫిల్మ్‌నగర్‌లో రూ.1500 కోట్ల భూ కుంభకోణం
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఫిల్మ్‌నగర్ కేంద్రంగా రూ.1500కోట్ల విలువైన భూమిని రెడ్‌ఫోర్ట్ సంస్థ కారు చౌకగా కొట్టేసింది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, మాజీ మంత్రి ఉన్నట్లు సమాచారం. బాచుపల్లి భూమికి బదులుగా ఫిల్మ్‌నగర్ ల్యాండ్‌ను రెడ్‌ఫోర్ట్ సంస్థ కాజేసింది. అందుకోసం చట్టంలోని లొసుగులను రెడ్‌ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ సంస్థ తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది. 2007 నుంచి ఇప్పటివరకు ఎన్నో పరిణామాలు […]
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఫిల్మ్‌నగర్ కేంద్రంగా రూ.1500కోట్ల విలువైన భూమిని రెడ్‌ఫోర్ట్ సంస్థ కారు చౌకగా కొట్టేసింది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, మాజీ మంత్రి ఉన్నట్లు సమాచారం. బాచుపల్లి భూమికి బదులుగా ఫిల్మ్‌నగర్ ల్యాండ్‌ను రెడ్‌ఫోర్ట్ సంస్థ కాజేసింది. అందుకోసం చట్టంలోని లొసుగులను రెడ్‌ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ సంస్థ తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది.
2007 నుంచి ఇప్పటివరకు ఎన్నో పరిణామాలు ఇందులో వెలుగుచూడగా.. నాటి ప్రభుత్వం ‘దిల్’ ద్వారా ప్రభుత్వ భూముల ఈ-వేలం నిర్వహించింది. ఇందులో భాగంగానే హైఫై ఏరియాలో అప్పనంగా 14 ఎకరాలు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఫిల్మ్ నగర్‌లోని సర్వేనెంబర్ 403లో 10 ఎకరాల తెరవెనక ఎంతో కథ నడిచినట్లు సమాచారం. 4 ఎకరాలను కబ్జా చేసేందుకు స్థానికంగా కొండపై ఉన్న హనుమాన్ టెంపుల్‌ను కూల్చివేసేందుకు అక్బర్ సంస్థ యత్నిస్తోంది.