రూ.10లక్షల కిరాయి మాఫీ..
దిశ, మెదక్ : కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిర్భంధం వలన ప్రజలు, కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన వ్యాపార వేత్త, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రాఘవేందర్ రావు తన ఔదార్యాన్ని చాటాడు. దుకాణాల నుంచి తనకు రావాల్సిన రూ.10లక్షల అద్దెను మాఫీ చేసినట్టు ప్రకటించారు.నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల రాఘవేంద్రరావు కాంప్లెక్స్‌లో పలు దుకాణ సముదాయాలు ఉన్నాయి. […]
దిశ, మెదక్ : కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిర్భంధం వలన ప్రజలు, కార్మికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన వ్యాపార వేత్త, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రాఘవేందర్ రావు తన ఔదార్యాన్ని చాటాడు. దుకాణాల నుంచి తనకు రావాల్సిన రూ.10లక్షల అద్దెను మాఫీ చేసినట్టు ప్రకటించారు.నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల రాఘవేంద్రరావు కాంప్లెక్స్‌లో పలు దుకాణ సముదాయాలు ఉన్నాయి. వీటి ద్వారా అతనికి నెలకు రూ.5లక్షల వరకు కిరాయి వస్తుంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్నందున 2నెలల కిరాయిలను మాఫీ చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి కిరాయి రద్దు చేస్తూ రాఘవేందర్ రావు తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tags: carona, lockdown, rs.10lacs rent cancel, medak, li0ns club president