తెలంగాణలో ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మాస్క్ లేకుంటే భారీ ఫైన్
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కరోనా టీకా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అలసత్వం వహిస్తే కరోనా ప్రబలే అవకాశం ఉందని, ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటి వరకు భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని ఆయన అన్నారు. తెలంగాణలో కొత్త వేరియంట్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఒమిక్రాన్ నివారణకు ప్రతీ […]
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కరోనా టీకా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అలసత్వం వహిస్తే కరోనా ప్రబలే అవకాశం ఉందని, ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటి వరకు భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని ఆయన అన్నారు. తెలంగాణలో కొత్త వేరియంట్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
ఒమిక్రాన్ నివారణకు ప్రతీ ఒక్కరూ తమ వంతుగా మాస్కులు, భౌతిక దూరం, టీకాలు తీసుకోవడం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, రాష్ట్రంలో మాస్క్ నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. మాస్క్ ధరించకుంటే రాబోయే రోజుల్లో రూ. 1000 జరిమానా వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టు డీహెచ్ తెలిపారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన 325 మందికి పరీక్షలు చేస్తున్నట్లు డీహెచ్ తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని శాంపిల్స్‌ను జీనామ్ సీక్వెన్స్‌కు పంపినట్లు వివరించారు.