అద్దె బస్సులకు రూ.10 కోట్లు రిలీజ్

‌దిశ, న్యూస్‌బ్యూరో: సంస్థలోని అద్దె బస్సులకు టీఎస్ ఆర్టీసీ బుధవారం రూ.10 కోట్లు పేమెంట్ విడుదల చేసింది. మార్చి నెలలో లాక్‌డౌన్‌కు ముందు తిరిగిన 21 రోజులకు రావాల్సిన రూ.20కోట్లకు గాను సగం చెల్లింపులు చేసింది. జూలై నెల దాకా రావాల్సిన మిగతా రూ.90కోట్లను దశల వారిగా చెల్లిస్తామని సంస్థ ఎండీ సునీల్ శర్మ హామీ ఇచ్చినట్లు అద్దె బస్సుల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ లో మొత్తం 9,784 బస్సులకుగాను 6641 సొంత బస్సులుండగా […]

Update: 2020-07-29 08:39 GMT

‌దిశ, న్యూస్‌బ్యూరో: సంస్థలోని అద్దె బస్సులకు టీఎస్ ఆర్టీసీ బుధవారం రూ.10 కోట్లు పేమెంట్ విడుదల చేసింది. మార్చి నెలలో లాక్‌డౌన్‌కు ముందు తిరిగిన 21 రోజులకు రావాల్సిన రూ.20కోట్లకు గాను సగం చెల్లింపులు చేసింది. జూలై నెల దాకా రావాల్సిన మిగతా రూ.90కోట్లను దశల వారిగా చెల్లిస్తామని సంస్థ ఎండీ సునీల్ శర్మ హామీ ఇచ్చినట్లు అద్దె బస్సుల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ లో మొత్తం 9,784 బస్సులకుగాను 6641 సొంత బస్సులుండగా 3,143 అద్దె బస్సులున్నాయి.

Tags:    

Similar News