కోల్‌కతాను చిత్తు చేసిన బెంగళూరు

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 28వ మ్యాచ్‌లో కోల్‌కతా పై రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్లు వచ్చిన వారు వచ్చినట్టే మైదానం వీడారు. బెంగళూరు బౌలర్ల ధాటికి బ్యాట్‌ వదిలేయడంతో చాలెంజర్స్ అవలీలగా గెలుపొందింది. కోల్‌కతా ఇన్నింగ్స్: తొలుత ఓపెనింగ్ దిగిన టామ్‌ బెంటన్ (8) పరుగులకే వెనుదిరిగాడు. శుబ్‌మన్ గిల్ క్రీజులో కుదురుకున్న ఎక్కువ […]

Update: 2020-10-12 12:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 28వ మ్యాచ్‌లో కోల్‌కతా పై రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్లు వచ్చిన వారు వచ్చినట్టే మైదానం వీడారు. బెంగళూరు బౌలర్ల ధాటికి బ్యాట్‌ వదిలేయడంతో చాలెంజర్స్ అవలీలగా గెలుపొందింది.

కోల్‌కతా ఇన్నింగ్స్:

తొలుత ఓపెనింగ్ దిగిన టామ్‌ బెంటన్ (8) పరుగులకే వెనుదిరిగాడు. శుబ్‌మన్ గిల్ క్రీజులో కుదురుకున్న ఎక్కువ సేపు రాణించలేదు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రానా (9) పరుగులకే ఔట్ అయ్యాడు. ఓపెనర్ శుబ్‌మన్‌గిల్(34) పరుగులు చేసి రనౌట్‌ రూపంలో మైదానం వీడాడు. దీంతో కేవలం 55 పరుగులకే కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్(8), దినేష్ కార్తీక్ (1), ఆండ్రూ రస్సెల్(16) పరుగులు చేయడంతో 85 పరుగుల వద్ద టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఇక లోయర్ ఆర్డర్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి(16), ప్యాట్‌ కమ్మిన్స్ (1) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన కమలేష్ నాగర్‌కోటి(4) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో 108 పరుగలకు కోల్‌కతా 9 వికెట్లను కోల్పోయింది.

ఇక చివరి ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి(7), ప్రసీద్ కృష్ణ(2)క్రీజులో ఉన్న 6 బంతుల్లో 87 పరుగులు ఊహకు కూడా అందకుండా పోయింది. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో కోల్‌కతా కేవలం 112 పరుగులు మాత్రమే చేసి ఘోరా పరాజయాన్ని ముటగట్టుకుంది. 82 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించింది.

బెంగళూరు ఇన్నింగ్స్:

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్(32), ఆరోన్‌ఫించ్ (47) పరుగులు చేసి పెవిలియన్ చేరినా.. మంచి ఇన్నింగ్స్‌ ఆడారు.

దంచికొట్టిన డివిలియర్స్:

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ, మిడిలార్డర్‌ ఏబీ డివిలియర్స్ చివరి వరకు ‌ క్రీజులో నిలబడ్డారు. ముఖ్యంగా ఏబీ డివిలియర్స్(73*) 360 డిగ్రీస్ ఇన్నింగ్స్‌ ప్రదర్శించాడు. ఏకంగా 33 బంతుల్లో 5 ఫోర్లు. 6 సిక్సర్లతో చెలరేగి 73 పరుగులు చేసి నాటౌ‌ట్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్ కోహ్లీ 28 బంతుల్లో (33*) పరుగులతో రాణించాడు. దీంతో బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగలిగింది.

Royal Challengers Bangalore Innings: 194-2 (20 Ov)

1. ఆరోన్ ఫించ్ b ప్రసీద్ 47(37)
2. దేవదత్ పడిక్కల్ b రస్సెల్ 32(23)
3. విరాట్ కోహ్లీ నాటౌట్ 33(28)
4. ఏబీ డివిలియర్స్ నాటౌట్ 73(33)

ఎక్స్‌ట్రాలు: 9

మొత్తం స్కోరు: 194

వికెట్ల పతనం: 67-1 (దేవదత్ పడిక్కల్, 7.4), 94-2 (ఆరోన్ ఫించ్, 12.2)

బౌలింగ్:
ప్యాట్ కమ్మిన్స్ 4-0-38-0
ప్రసీద్ కృష్ణ 4-0-42-1
ఆండ్రూ రస్సెల్ 4-0-51-1
వరుణ్ చక్రవర్తి 4-0-25-0
కమలేష్ నాగర్‌కోటి 4-0-36-0

Kolkata Knight Riders Innings: 112-9 (20 Ov)

1. టామ్ బెంటన్ b నవదీప్ సైని 8(12)
2. శుబ్‌మన్ గిల్ రనౌట్ (ఉదాన/డివిలియర్స్) 34(25)
3. నితీష్ రానా b వాషింగ్టన్ సుందర్ 9(14)
4.ఇయాన్ మోర్గాన్ c ఉదాన b వాషింగ్టన్ సుందర్ 8(12)
5. దినేష్ కార్తీక్ (c) (wk)b చాహల్ 1(2)
6.ఆండ్రూ రస్సెల్ c సిరాజ్ b ఉదాన 16(10)
7.రాహుల్ త్రిపాఠి c క్రిస్ మోరిస్ b సిరాజ్ 16(22)
8. ప్యాట్ కమ్మిన్స్ c దేవదత్ పడిక్కల్ b క్రిస్ మోరిస్ 1(3)
9.కమలేష్ నాగర్‌కోటి b క్రిస్ మోరిస్ 4(7)
10. వరుణ్ చక్రవర్తి నాటౌట్ 7(10)
11. ప్రసీద్ కృష్ణ నాటౌట్ 2(3)

ఎక్స్‌ట్రాలు: 6

మొత్తం స్కోరు: 112

వికెట్ల పతనం: 23-1 (టామ్ బెంటన్, 3.6), 51-2 (నితీష్ రానా, 7.6), 55-3 (శుబ్‌మన్ గిల్, 9.3), 62-4 (దినేష్ కార్తీక్, 10.3), 64-5 (ఇయాన్ మోర్గాన్, 11.1), 85-6 (ఆండ్రూ రస్సెల్, 13.5) 89-7 (ప్యాట్ కమ్మిన్స్, 14.5), 99-8 (రాహుల్ త్రిపాఠి, 16.6), 108-9 (కమలేష్ నాగర్‌కోటి, 18.6)

బౌలింగ్:
క్రిస్ మోరిస్ 4-0-17-2
నవదీప్ సైని 3-0-17-1
మహ్మద్ సిరాజ్ 3-0-24-1
వాషింగ్టన్ సుందర్ 4-0-20-2
యూజువేంద్ర చాహల్ 4-0-12-1
ఇసురు ఉదాన 2-0-19-1

Tags:    

Similar News