బెంగళూరు స్కోరు 171/6

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) పర్వాలేదనిపించింది. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి బెంగళూరు జట్టు 171 పరుగులు చేసింది. ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఛేదిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఇన్నింగ్స్ సాగిందిలా.. ఓపెనర్లు ఆరోన్ ఫించ్(20), పడిక్కల్(18) పరుగులకే వెనుదిరిగిన కెప్టెన్ కోహ్లీ(48) స్కోర్‌తో రాణించాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన వాషింగ్టన్ సుందర్(13), శివం దూబే(23) రన్స్‌ మాత్రమే చేసి […]

Update: 2020-10-15 10:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) పర్వాలేదనిపించింది. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి బెంగళూరు జట్టు 171 పరుగులు చేసింది. ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఛేదిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

ఇన్నింగ్స్ సాగిందిలా..
ఓపెనర్లు ఆరోన్ ఫించ్(20), పడిక్కల్(18) పరుగులకే వెనుదిరిగిన కెప్టెన్ కోహ్లీ(48) స్కోర్‌తో రాణించాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన వాషింగ్టన్ సుందర్(13), శివం దూబే(23) రన్స్‌ మాత్రమే చేసి ఔట్ అయ్యారు.

బెంగళూరు తరఫున 6వ స్థానంలో వచ్చిన ఏబీ డివిలియర్స్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ(48) షమి ఓవర్‌లో షాట్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 18 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 137 పరుగులు చేసింది. ఇక లోయర్ ఆర్డర్‌లో వచ్చిన క్రిస్ మోరిస్ బౌండరీలు పారించాడు. కేవలం 8 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 8వ స్థానంలో వచ్చిన ఇసురు ఉదాన 5 బంతుల్లో 10 పరుగులు చేశాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

స్కోరు బోర్డు:
Royal Challengers Bangalore Innings: 171-6 (20 Ov)
1. ఆరోన్ ఫించ్ b మురుగన్ అశ్విన్ 20(18)
2. దేవదత్ పడిక్కల్ c పూరన్ b అర్ష్‌దీప్ సింగ్ 18(12)
3. విరాట్ కోహ్లీ(C) c రాహుల్ b షమి 48(39)
4. వాషింగ్టన్ సుందర్ c క్రిస్ జోర్డన్ b మురుగన్ అశ్విన్ 13(14)
5. శివం దూబే c రాహుల్ b క్రిస్ జోర్డన్ 23(19)
6. ఏబీ డివిలియర్స్ (wk) c దీపక్ హుడా b షమి 2(5)
7. క్రిస్ మోరిస్ నాటౌట్ 25(8)
8. ఇసురు ఉదాన నాటౌట్ 10(5)

ఎక్స్‌ట్రాలు: 12

మొత్తం స్కోరు: 171/6

వికెట్ల పతనం:38-1 (దేవదత్ పడిక్కల్, 4.1), 62-2 (ఆరోన్ ఫించ్, 6.3), 86-3 (వాషింగ్టన్ సుందర్, 10.3)
127-4 (శివం దూబే, 15.6), 134-5 (ఏబీ డివిలియర్స్, 17.3), 136-6 (విరాట్ కోహ్లీ, 17.5).

బౌలింగ్:
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4-0-28-0
మహ్మద్ షమి 4-0-45-2
అర్ష్‌దీప్ సింగ్ 2-0-20-1
రవి భిష్నోయ్ 3-0-29-0
మురుగన్ అశ్విన్ 4-0-23-2
క్రిస్ జోర్డన్ 3-0-20-1

Tags:    

Similar News