ప్రత్యర్థులు ఊహించని విరాటపర్వం
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. బ్యాక్ టు ఫామ్ అంటూ బౌండరీల మోత మోగించాడు. వన్‌డౌన్‌లో వచ్చి చివరివరకు కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టిన కోహ్లీ 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 13 పరుగులు ఉన్నప్పుడు క్రీజులో నిలబడి ఆర్సీబీ స్కోర్ బోర్డును 169కి లాక్కెల్లాడు. ఓపెనర్లు విఫలం: ఓపెనర్ ఫించ్ (2), దేవదత్ […]
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. బ్యాక్ టు ఫామ్ అంటూ బౌండరీల మోత మోగించాడు. వన్‌డౌన్‌లో వచ్చి చివరివరకు కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టిన కోహ్లీ 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 13 పరుగులు ఉన్నప్పుడు క్రీజులో నిలబడి ఆర్సీబీ స్కోర్ బోర్డును 169కి లాక్కెల్లాడు.
ఓపెనర్లు విఫలం:
ఓపెనర్ ఫించ్ (2), దేవదత్ పడిక్కల్(34), డివిలియర్స్(0) డకౌట్‌తో పెవిలియన్ చేరిన కెప్టెన్ మాత్రం క్రీజులో స్థిరంగా నిలబడ్డాడు. ఆది నుంచి అంతిమం వరకు సమిష్ఠిగా రాణించాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన సుందర్ కూడా 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో 93 పరుగులకే బెంగళూరు నాలుగు వికెట్లను కోల్పోయింది.
దూబే సాయంతో..
ఇక ఆ తర్వా త 6వ స్థానంలో వచ్చిన శివం దూబే విరాట్ కోహ్లీకి మంచి భాగస్వామ్యం అందించాడు. శివం దూబే 14 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (90)* ప్రత్యర్ఠులకు ఊహించని రీతిలో విరాటపర్వాన్ని చూపించాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి బెంగళూరు 169 పరుగులు చేసింది.
స్కోరు బోర్డు:
Royal Challengers Bangalore Innings:
1. దేవదత్ పడిక్కల్ c డు ప్లెసిస్ b ఠాకుర్ 33(34)
2. ఆరోన్ ఫింఛ్ b డి. చాహర్ 2(9)
3. విరాట్ కోహ్లీ (c) నాటౌట్ 90(52)
4 .ఏబీ డివిలియర్స్ (wk)c ధోని b ఠాకుర్ 0(2)
5. వాషింగ్టర్ సుందర్ c ధోని b శామ్ కుర్రాన్ 10(10),
6. శివం దూబే నాటౌట్ 22(14)
ఎక్స్‌ట్రాలు: 12
మొత్తం స్కోరు: 169/4
వికెట్ల పతనం: 13-1 (ఆరోన్ ఫించ్, 2.5), 66-2 (దేవదత్ పడిక్కల్, 10.2), 67-3 (ఏబీ డివిలియర్స్, 10.5),
93-4 (వాషింగ్టర్ సుందర్, 14.3).
బౌలింగ్:
దీపక్ చాహర్ 3-0-10-1
శామ్ కుర్రాన్ 4-0-48-1
శార్దుల్ ఠాకుర్ 4-0-40-2
డ్వెయిన్ బ్రావో 3-0-29-0
కర్ణ్ శర్మ 4-0-34-0
రవీంద్ర జడేజా 2-0-7-0