కరోనాకు ‘బూటు’ దెబ్బ
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా, ఇతర దేశాల్లో మాత్రం కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మనదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని డబ్లూహెచ్ఓ పదే పదే చెబుతోంది. అయితే, కరోనా పుట్టి ఏడాది దాటిపోగా, కరోనా మీద ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. రోజులు గడుస్తున్నా కొద్దీ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో మాస్క్‌లకు, సోషల్ డిస్టెన్స్‌కు బైబై చెప్పేశారు. రద్దీ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా, ఇతర దేశాల్లో మాత్రం కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మనదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని డబ్లూహెచ్ఓ పదే పదే చెబుతోంది. అయితే, కరోనా పుట్టి ఏడాది దాటిపోగా, కరోనా మీద ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. రోజులు గడుస్తున్నా కొద్దీ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో మాస్క్‌లకు, సోషల్ డిస్టెన్స్‌కు బైబై చెప్పేశారు. రద్దీ ప్రదేశాల్లో యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. కాగా ఈ నిర్లక్ష్యాన్ని గమనించిన రోమేనియాకు చెందిన గ్రెగోర్ లూప్ అనే షూ మేకర్.. ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం చూపెట్టాడు.
కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో కొందరు గొడుగుతో కరోనాకు చెక్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఇప్పుడు గ్రెగోర్ లూప్ మాత్రం ‘బూట్ల’తో సోషల్ డిస్టెన్స్‌కు కొత్త నిర్వచనం చెబుతున్నాడు. ఆయన ఇటీవలే 75 (యూరోపియన్) సైజులో షూ తయారు చేశాడు. ఆ షూ ముందు భాగం చాలా పొడుగ్గా ఉంటుంది. దీంతో ఆ షూ వేసుకున్న వారి ముందు ఎవరైనా నిలబడాలంటే కనీసం రెండు మీటర్ల దూరం పాటించాల్సిందే. లేకపోతే, ఎదుటి వ్యక్తికి బూట్లు తగిలే అవకాశం ఉంది. ఈ కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం సులువు అవుతుందని లూప్ అంటున్నాడు. కాగా లూప్ తయారు చేసిన ఈ బిగ్ షూస్‌కు ప్రశంసలు రావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్డర్లు కూడా వస్తుండటం విశేషం. తన దగ్గరకి వచ్చే రెగ్యులర్ కస్టమర్లతో పాటు బెల్జియంకు చెందిన ఓ డ్యాన్స్ గ్రూప్, యూఎస్ రాక్ బ్యాండ్‌లు ఈ బూట్లను ఆర్డర్ చేసినట్లు లూప్ తెలిపాడు.
పెద్ద పెద్ద పాదాలుండేవారికి బూట్లు దొరకడం చాలా కష్టం. అయితే వారికి లూప్ తయారు చేసిన బూట్లు తెగనచ్చడంతో, వాళ్లు కూడా తమ కాళ్లకు సరిపోయే సైజులో కస్టమైజ్డ్ షూ తయారు చేసి ఇవ్వాలని ఆయనను కోరుతున్నారు. ఈ షూ ధర 13 వేల రూపాయలు కాగా, ఈ బిగ్ పెయిర్ తయారయ్యే లెదర్‌తో సాధారణంగా త్రీ పెయిర్ షూస్ తయారు చేయొచ్చు.