హర్భజన్‌ను కాపీ కొట్టిన రోహిత్ శర్మ

దిశ, వెబ్‌డెస్క్: రోహిత్ శర్మ.. టీమిండియా జట్టులో ఓపెనర్. హార్డ్ హిట్టర్ కూడా.. మైదానంలో దిగితే బౌండరీలతో పాటు సెంచరీలను సైతం అవలీలగా చేసే సత్తా అతడి సొంతం. క్రీజులో పాతుకుపోయాడంటే డబుల్ సెంచరీ చేయడం ఖాయం. అటువంటి ఆటగాడు బౌలింగ్‌లో మాత్రం స్పిన్నర్ హర్భజన్‌‌ సింగ్‌ను కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. సేమ్ భజ్జీలాగే స్పిన్ వేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ రోహిత్ శర్మ బౌలింగ్ ఎక్కడ వేశాడో అని ఆశ్యర్యపోకండి.. […]

Update: 2021-02-06 08:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోహిత్ శర్మ.. టీమిండియా జట్టులో ఓపెనర్. హార్డ్ హిట్టర్ కూడా.. మైదానంలో దిగితే బౌండరీలతో పాటు సెంచరీలను సైతం అవలీలగా చేసే సత్తా అతడి సొంతం. క్రీజులో పాతుకుపోయాడంటే డబుల్ సెంచరీ చేయడం ఖాయం. అటువంటి ఆటగాడు బౌలింగ్‌లో మాత్రం స్పిన్నర్ హర్భజన్‌‌ సింగ్‌ను కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. సేమ్ భజ్జీలాగే స్పిన్ వేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఇంతకీ రోహిత్ శర్మ బౌలింగ్ ఎక్కడ వేశాడో అని ఆశ్యర్యపోకండి.. ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా శనివారం రెండో రోజు జో రూట్ సేన బ్యాటింగ్ కొనసాగిస్తుంది. అప్పటికే భారత కీలక బౌలర్లు ఓవర్ల మీద ఓవర్లు వేసి కాస్తా అలసటకు గురయ్యారేమో.. బ్యాట్ పట్టాల్సిన రోహిత్ భాయ్.. బంతిని పట్టాడు. రెండు ఓవర్లు వేసి 7 పరుగులు ఇచ్చాడు. అయితే, రోహిత్ స్పిన్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి.. రోహిత్ శర్మ హర్భజన్‌‌ సింగ్‌ లాగా బౌలింగ్ చేశాడని క్యాప్షన్ ఇచ్చాడు. అంతే, ఈ వీడియో చూసిన నెటిజన్లు అవును నిజమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

https://twitter.com/vishalghandat1/status/1357973161308901384?s=20

 

Tags:    

Similar News