టీమిండియాకు కొత్త జోష్.. రోహిత్ వచ్చేశాడు
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియాలోకి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వచ్చేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో రోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకున్నారు. గత రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మను తీసుకోకపోవడంతో హిట్‌మ్యాన్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మళ్లీ రోహిత్‌ను తీసుకోవడంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత రెండు మ్యాచ్‌లలో రాణించలేకపోయినా.. కేఎల్ రాహుల్‌కి టీమ్ మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్ అత్యంత కీలకం కావడంతో.. రోహిత్‌ను తీసుకున్నట్లు […]
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియాలోకి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వచ్చేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో రోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకున్నారు. గత రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మను తీసుకోకపోవడంతో హిట్‌మ్యాన్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మళ్లీ రోహిత్‌ను తీసుకోవడంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
గత రెండు మ్యాచ్‌లలో రాణించలేకపోయినా.. కేఎల్ రాహుల్‌కి టీమ్ మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్ అత్యంత కీలకం కావడంతో.. రోహిత్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మూడో టీ20లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇండియా టీమ్: Rohit Sharma, KL Rahul, Ishan Kishan, Virat Kohli(c), Rishabh Pant(w), Shreyas Iyer, Hardik Pandya, Washington Sundar, Shardul Thakur, Bhuvneshwar Kumar, Yuzvendra Chahal
ఇంగ్లండ్ టీమ్: Jason Roy, Jos Buttler(w), Dawid Malan, Jonny Bairstow, Eoin Morgan(c), Ben Stokes, Sam Curran, Chris Jordan, Jofra Archer, Adil Rashid, Mark Wood