ఎన్ఏసీలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నారు. గాయపడిన ప్రతీ క్రికెటర్ ఎన్‌సీఏలో రీహాబిలిటేషన్‌లో తప్పకుండా పాల్గొనాలని ఇటీవల బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రోహిత్, రవీంద్ర ఇద్దరూ బెంగళూరు చేరుకున్నారు. రోహిత్ ఎడమ కాలికి గాయం అయ్యింది. ఎడమ తొడ కండరాలకు గాయం […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నారు. గాయపడిన ప్రతీ క్రికెటర్ ఎన్‌సీఏలో రీహాబిలిటేషన్‌లో తప్పకుండా పాల్గొనాలని ఇటీవల బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రోహిత్, రవీంద్ర ఇద్దరూ బెంగళూరు చేరుకున్నారు. రోహిత్ ఎడమ కాలికి గాయం అయ్యింది.
ఎడమ తొడ కండరాలకు గాయం కావడంతో.. అతడు కనీసం 3 నుంచి 4 వారాలు విశ్రాంతి తీసుకోవాలని ఎన్‌ఏసీ ఫిజియోథెరపిస్టులు చెప్పారు. వన్డే సిరీస్‌కలా రోహిత్ శర్మ కోలుకునే అవకాశం ఉన్నది. రవీంద్ర జడేజా గాయం కాస్త తీవ్రమైనది. అతడికి చిన్న సర్జరీ కూడా చేయాల్సి ఉన్నది. అనంతరం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రవీంద్ర జడేజా ఇక నేరుగా ఐపీఎల్ 2022 సీజన్‌లోనే మనం చూడగలిగే అవకాశం ఉంటుంది. కాగా, ఇండియా అండర్ 19 జట్టు ప్రస్తుతం ఎన్ఏసీలోనే ఉన్నది. అక్కడ శిక్షణ పొందుతున్న కుర్రాళ్లకు రోహిత్ శర్మ పాఠాలు చెప్పాడు. వారితో సరదాగా కాసేపు గడిపి క్రికెటింగ్ పాఠాలు చెప్పాడు. అతడు ఇచ్చిన విలువైన సూచనలు శ్రద్దగా విన్నారు. అనంతరం కుర్రాళ్లతో సరగాదా ఫొటోలు దిగాడు.