పాతబస్తీలో రోహింగ్యాలు: కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లోని పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం తమవద్ద ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని, మౌనంగా ఉండటానికి కారణమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. కేంద్రం రోహింగ్యాలను వెనక్కి పంపిస్తుందని అన్నారు. బెంగళూరు సౌత్ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్యపై […]
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లోని పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం తమవద్ద ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని, మౌనంగా ఉండటానికి కారణమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. కేంద్రం రోహింగ్యాలను వెనక్కి పంపిస్తుందని అన్నారు.
బెంగళూరు సౌత్ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్యపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేయటాన్ని ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. మంత్రి కెటిఆర్ 50 ప్రశ్నావళి పూర్తిగా జాతీయ అంశాలతో కూడుకున్నవేనని, మేం గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా మీరు చేసిన అభివృద్దేమిటని అడిగితే… వాటికి జవాబులు చేతకానితనంతో మట్లాడటం హాస్యాస్పదమన్నారు. మహానాయకులు ఎన్టీఆర్, పీవీలను బీజేపీ గౌరవిస్తోందన్నారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం ఎవరు కల్పిస్తున్నారో ముఖ్యమంత్రే బయటపెట్టాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.