ఆమ్లెట్లు వేసే రోబో..
అత్యంత సులభంగా చేసుకుని తినగల వంటకం ఆమ్లెట్. ఏముంది.. గుడ్డులో కారం, ఉప్పు, పసుపు కలిపి పెనం మీద వేస్తే ఆమ్లెట్ రెడీ అవుతుందని అనుకోవచ్చు. కానీ దాన్ని టేస్టీగా వేయాలంటే కొద్దిగా బ్రెయిన్ వాడాల్సిందే. ఈ నేపథ్యంలో కంప్యూటర్ బ్రెయిన్‌తో ఆమ్లెట్ వేయగలిగే రోబోను కనిపెట్టారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇంజినీర్లు. బెకో అనే కంపెనీతో కలిసి రోబోకి ఆమ్లెట్ వేయడం నేర్పించారు. గుడ్లు పగలకొట్టడం, స్టవ్ ముట్టించడం, పెనం పెట్టడం, మిశ్రమం కలపడం, ఆమ్లెట్ వేయడం […]
అత్యంత సులభంగా చేసుకుని తినగల వంటకం ఆమ్లెట్. ఏముంది.. గుడ్డులో కారం, ఉప్పు, పసుపు కలిపి పెనం మీద వేస్తే ఆమ్లెట్ రెడీ అవుతుందని అనుకోవచ్చు. కానీ దాన్ని టేస్టీగా వేయాలంటే కొద్దిగా బ్రెయిన్ వాడాల్సిందే. ఈ నేపథ్యంలో కంప్యూటర్ బ్రెయిన్‌తో ఆమ్లెట్ వేయగలిగే రోబోను కనిపెట్టారు కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇంజినీర్లు. బెకో అనే కంపెనీతో కలిసి రోబోకి ఆమ్లెట్ వేయడం నేర్పించారు. గుడ్లు పగలకొట్టడం, స్టవ్ ముట్టించడం, పెనం పెట్టడం, మిశ్రమం కలపడం, ఆమ్లెట్ వేయడం వంటి అన్ని పనులను ఈ రోబో ఒకదాని తర్వాత ఒకటి చేస్తుంది.
కేవలం ఇలా భౌతికంగా కనిపించే పనులు మాత్రమే కాకుండా మెషిన్ లెర్నింగ్ టెక్నిక్‌ల ద్వారా రుచికరమైన ఆమ్లెట్ వేయడం కూడా నేర్పించారు. ‘రోబో షెఫ్‌ల తయారీలో ఇది ముందడుగు’ అని ఇంజినీర్ ఫుమియా లిడా అన్నారు. ఇంకా భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి ఈ రోబోలను కేవలం ఆమ్లెట్ వేసేందుకే పరిమితం చేయకుండా మరిన్ని వంటకాలు నేర్పించే ప్రయత్నం చేస్తామని లిడా తెలిపారు.