"రోర్ ఆఫ్ RRR": జక్కన్న మరో అద్భుత ఆవిష్కరణ

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచమంతా  వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమయం  వచ్చేసింది.  భారతీయ సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ”ఆర్ఆర్ఆర్” (రణం రౌద్రం రుధిరం) మేకింగ్ వీడియో వచ్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేకింగ్ వీడియోను ”రోర్ ఆఫ్ RRR” అనే పేరుతో మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట […]

Update: 2021-07-15 01:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. భారతీయ సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ”ఆర్ఆర్ఆర్” (రణం రౌద్రం రుధిరం) మేకింగ్ వీడియో వచ్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మేకింగ్ వీడియోను ”రోర్ ఆఫ్ RRR” అనే పేరుతో మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట సంచలనం గా మారింది. ఇక మేకింగ్ వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ ని తలపించేలా భారీ భారీ నిర్మాణాలతో పాటు, ఒక పాన్ ఇండియా మూవీ కోసం దర్శకుడితో సహా ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారో ఈ వీడియో తెలుపుతుంది.

ఇక సినిమాలో నటిస్తున్న కీలక పాత్రల మేకింగ్ కూడా ఈ వీడియో లో చూపించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగణ్, శ్రీయ, సముద్ర ఖని, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి.. ఇలా పాత్రకు సంబంధించిన విజువల్స్ ఇందులో చూపించారు. ఇక గ్రాఫిక్ విషయంలో ఈ మాత్రం తగ్గకుండా రాజమౌళి షాట్లను పరిశీలించడం, ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి సెట్స్ నమూనాలను పరిశీలించడం .. చేయనున్న సీన్స్ గురించి కెమెరామెన్ తో మాట్లాడటం వంటి అంశాలపై కట్ చేసిన ఈ వీడియో ఆద్యంతం ఒక అద్భుతమేనే చెప్పాలి. ‘బాహుబలి’ని తలదన్నేలా ”రోర్ ఆఫ్ RRR” మేకింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ వీడియో లో స్పెషల్ అట్రాక్షన్ గా రామరాజు పోలీస్ ఆఫీసర్ విజువల్స్ నిలిచాయి. ఇక వీటితో పాటు కీరవాణి నేపథ్య సంగీతం మేకింగ్‌ వీడియోని మరో మెట్టు ఎక్కించింది. ప్రస్తుతం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమా అన్నింటినీ పూర్తిచేసుకొని అక్టోబర్ 13వ తేదీన రావడానికి సిద్దమవుతుంది.

Click Here For Video Post..

Tags:    

Similar News