అచ్చంపేట నియోజకవర్గంలో పరిస్థితి దారుణం
దిశ, అచ్చంపేట: నియోజకవర్గంలో చాలా గ్రామాలలో చినుకు పడితే చాలు ఇంటి నుండి కాలు బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆశించిన మేర గ్రామాలలో అభివృద్ధి జరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి చిరు జల్లులు పడగానే గ్రామాలలోని అంతర్గత రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. నియోజకవర్గంలోని ఉప్పునూతల, అమ్రాబాద్, లింగాల, పదరా తదితర మండలాల్లో ఏ గ్రామంలో చూసినా కూడా అంతర్గత రోడ్ల మరమ్మతులకు నోచుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు […]
దిశ, అచ్చంపేట: నియోజకవర్గంలో చాలా గ్రామాలలో చినుకు పడితే చాలు ఇంటి నుండి కాలు బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆశించిన మేర గ్రామాలలో అభివృద్ధి జరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి చిరు జల్లులు పడగానే గ్రామాలలోని అంతర్గత రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. నియోజకవర్గంలోని ఉప్పునూతల, అమ్రాబాద్, లింగాల, పదరా తదితర మండలాల్లో ఏ గ్రామంలో చూసినా కూడా అంతర్గత రోడ్ల మరమ్మతులకు నోచుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో అంతర్గత రోడ్లు మరమ్మతులు చేసే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.