తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్

దిశ, వాజేడు : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యాలు స్తంభించాయి. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని టేకులగూడెం గ్రామ శివారులో 163వ జాతీయ రహదారిపై వంతెన నీట మునగడంతో కొండ వైపు వెళ్లే వాహనాలు స్తంభించి రాకపోకలు నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలోకి వరద నీరు విపరీతంగా చేరింది. దీంతో కాళేశ్వరం, లక్ష్మి బ్యారేజ్, తుపాకులగూడెం, సమ్మక్క సారక్క బ్యారేజి నుంచి అధికారులు నీటిని విడుదల […]

Update: 2021-07-23 03:42 GMT

దిశ, వాజేడు : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యాలు స్తంభించాయి. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని టేకులగూడెం గ్రామ శివారులో 163వ జాతీయ రహదారిపై వంతెన నీట మునగడంతో కొండ వైపు వెళ్లే వాహనాలు స్తంభించి రాకపోకలు నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలోకి వరద నీరు విపరీతంగా చేరింది. దీంతో కాళేశ్వరం, లక్ష్మి బ్యారేజ్, తుపాకులగూడెం, సమ్మక్క సారక్క బ్యారేజి నుంచి అధికారులు నీటిని విడుదల చేయడంతో మధ్యాహ్నం రెండు గంటల సమయానికి వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి 12 మీటర్లకు చేరుకుంది. దీంతో టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారి వరద నీటిలో మునిగిపోయి రవాణా సౌకర్యం స్తంభించింది.

Tags:    

Similar News