ఔటర్ రింగ్‌రోడ్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
దిశ, వెబ్ డెస్క్ : నగరంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. కారు వేగంగా వచ్చి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయి..మృతదేహాలు అందులో ఇరుకుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు […]
దిశ, వెబ్ డెస్క్ : నగరంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. కారు వేగంగా వచ్చి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయి..మృతదేహాలు అందులో ఇరుకుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.