తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

దిశ, వెబ్‎డెస్క్ : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు టాకుర్‎పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో […]

Update: 2020-10-29 20:18 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు టాకుర్‎పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం పూర్తయిన తర్వాత కొండపై నుంచి కిందకు వస్తుండగా వ్యాన్‌ బోల్తా పడింది. ప్రమాద సమయంలో వ్యాన్ లో 30 మంది పెళ్లి బృందం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న రాజమండ్రి అర్బన్ ఎస్పీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News