రాంగ్ రూట్‌లో వచ్చి బైకును ఢీకొట్టిన ఆటో.. సినిమా స్టైల్‌లో రౌండ్స్ (షాకింగ్ వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోవడం లేదు. దీంతో వారు ప్రమాదాల భారీన పడుతూ, ఇతరులను కూడా ప్రమాదాలకు గురిచేస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ నెల 22న మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్ యూ టర్నింగ్ వద్ద రాంగు రూట్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్ : ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోవడం లేదు. దీంతో వారు ప్రమాదాల భారీన పడుతూ, ఇతరులను కూడా ప్రమాదాలకు గురిచేస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు.
ఈ నెల 22న మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్ యూ టర్నింగ్ వద్ద రాంగు రూట్‌లో వెళ్తున్న ఓ ఆటో.. బైకును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు బైకుపై వెళ్తున్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే బైకును ఢీకొట్టిన ఆటో డ్రైవర్ కిందపడిపోయాడు. అనంతరం ఆటో.. ఒక్కసారిగా పరుగు తీసింది. దీంతో ఆటోను ఆపేందుకు డ్రైవర్ ట్రై చేశాడు. కానీ, ఆటో రాంగ్ రూట్‌లో కొంత దూరం పరుగు తీసింది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు వీడియో షేర్ చేశారు.
You're on the 𝗪𝗥𝗢𝗡𝗚 𝗦𝗜𝗗𝗘 of everyone when you drive on the 𝗪𝗥𝗢𝗡𝗚 𝗦𝗜𝗗𝗘 of the road!#Roadsafety #RoadSafetyCyberabad pic.twitter.com/koc6q6CLTY
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) December 25, 2021