లాలు.. 9 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌కు రక్షణగా ఉన్న తొమ్మిది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలింది. రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో డైరెక్టర్స్ బంగ్లాలో చికిత్స పొందుతున్న లాలు ప్రసాద్ యాదవ్‌లో మాత్రం ప్రస్తుతం కరోనా లక్షణాలేవీ లేవని అధికారులు తెలిపారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలును అనారోగ్యం కారణంగా రిమ్స్‌లో చేర్చారు. తనకు సేవలందిస్తున్న ముగ్గురు సిబ్బందికి కరోనా సోకడంతో లాలును ముందస్తు రక్షణగా పేయింగ్ […]
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌కు రక్షణగా ఉన్న తొమ్మిది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలింది. రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో డైరెక్టర్స్ బంగ్లాలో చికిత్స పొందుతున్న లాలు ప్రసాద్ యాదవ్‌లో మాత్రం ప్రస్తుతం కరోనా లక్షణాలేవీ లేవని అధికారులు తెలిపారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలును అనారోగ్యం కారణంగా రిమ్స్‌లో చేర్చారు.
తనకు సేవలందిస్తున్న ముగ్గురు సిబ్బందికి కరోనా సోకడంతో లాలును ముందస్తు రక్షణగా పేయింగ్ వార్డు నుంచి డైరెక్టర్స్ బంగ్లాకు షిఫ్ట్ చేశారు. తాజాగా, డైరెక్టర్స్ బంగ్లాకు బయట పహారా కాస్తున్న తొమ్మిది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరితో నేరుగా లాలు కాంటాక్ట్ అయ్యే అవకాశం లేకపోయినప్పటికీ ఆయనతో సన్నిహితంగా మెలిగే సిబ్బందితో కాంటాక్ట్‌లో ఉన్నారని తెలిసింది.