అందుకు రియా సంతోషించాలి : సుశాంత్ ఫ్రెండ్

దిశ, వెబ్ డెస్క్ : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి అనంతరం చాలా మంది సెలెబ్రెటీలు స్పందించారు. కానీ, అతని ప్రియురాలు రియా చక్రవర్తి కొద్ది రోజుల వరకు సైలంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఓ రోజు మౌనం వీడారు. సుశాంత్ మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని రియా వ్యాఖ్యానించింది. ఆమెతో పాటే చాలా మంది అభిమానులు, సెలెబ్రిటీలు సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. చివరకు కేంద్ర ప్రభుత్వం సుశాంత్ […]

Update: 2020-08-09 10:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి అనంతరం చాలా మంది సెలెబ్రెటీలు స్పందించారు. కానీ, అతని ప్రియురాలు రియా చక్రవర్తి కొద్ది రోజుల వరకు సైలంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఓ రోజు మౌనం వీడారు. సుశాంత్ మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని రియా వ్యాఖ్యానించింది.

ఆమెతో పాటే చాలా మంది అభిమానులు, సెలెబ్రిటీలు సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. చివరకు కేంద్ర ప్రభుత్వం సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించింది. అయితే, సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని చాలా మార్లు మీడియా ముఖంగా కోరిన రియా చక్రవర్తి ప్రస్తుతం మాట మారుస్తున్నారు. ఈ విషయంపై సుశాంత్స్నేహితుడు నీలోత్పల్ మృణాల్ స్పందించారు.

సీబీఐ దర్యాప్తు కావాలని రియానే మొదటి నుంచి కోరిందని, ప్రస్తుతం ఆమె సంతోషించాలని అన్నారు. కానీ, వారినుంచి తప్పించుకుంటూ ఎందుకు దాక్కుంటుందో అర్థం కావడం లేదని, రియా సీబీఐకి సహకరించాలని మృణాల్ పేర్కొన్నారు. ‘ఒకవేళ రియా నిరపరాధి అయితే చీకటిలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సుశాంత్ ఏడాదిలో రూ.15కోట్లు ఎలా ఖర్చు పెడతాడు. ఏదేమైనా సీబీఐ రంగంలోకి దిగింది. నిజం కచ్చితంగా బయటకు వస్తుందని ఆశిస్తున్నా’నంటూ నీలోత్పల్ మృణాల్ వ్యాఖ్యనించాడు.

Tags:    

Similar News