వాహనదారులకు బిగ్ షాక్.. మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇంధన ధరలు పెరుగుతూ సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఓ వైపు నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలతో సామాన్యుని పరిస్థితి అస్థవ్యస్తంగా మారింది. శుక్రవారం మరోసారి పెట్రోల్ ధరలు పెరిగి వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. హైదరాబాద్‌లో ఇంధన ధరలు సెంచరీ దాటేస్తూ.. లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 32పైసలు పెరిగింది. ఈ పెరిగిన ధరలతో ఈ రోజు హైదరాబాద్‌లో లీటర్ […]

Update: 2021-09-30 22:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇంధన ధరలు పెరుగుతూ సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఓ వైపు నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలతో సామాన్యుని పరిస్థితి అస్థవ్యస్తంగా మారింది. శుక్రవారం మరోసారి పెట్రోల్ ధరలు పెరిగి వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి.

హైదరాబాద్‌లో ఇంధన ధరలు సెంచరీ దాటేస్తూ.. లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 32పైసలు పెరిగింది. ఈ పెరిగిన ధరలతో ఈ రోజు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.99 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 98.39ఉంది. అలాగే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.96 ఉండగా,డీజిల్ ధర రూ.99.82 ఉంది. ఇక దేశ రాజధాని అయినా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.89 కు చేరగా డీజిల్ ధర రూ. 90.17 కు పెరిగింది. ఇక వాణిజ్య నగరం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107. 95,కు చేరగా డీజిల్ ధర రూ. 97 . 84 కు పెరిగింది.

Tags:    

Similar News