హాంకాంగ్ నుంచి పెరుగుతున్న దిగుమతులు!
దిశ, సెంట్రల్ డెస్క్: చైనా దిగుమతులను తగ్గించే ప్రయత్నాలను అనుసరిస్తున్న క్రమంలో హాంకాంగ్ నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. గత కొన్నేళ్లలో ఈ దిగుమతులు వేగంగా పెరగడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి దేశంలో 6వ అతిపెద్ద దిగుమతి భాగస్వామిగా హాంకాంగ్ అవతరించింది. అయితే, హాంకాంగ్ నుంచి దిగుమతుల పెరుగుదలను కేంద్రం నిశితంగా గమనిస్తోందని, ఇది చైనా వ్యూహంలో భాగమనే సందేహం కలుగుతోందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. మునుపటి సంవత్సరంలో హాంకాంగ్ నుంచి […]
దిశ, సెంట్రల్ డెస్క్: చైనా దిగుమతులను తగ్గించే ప్రయత్నాలను అనుసరిస్తున్న క్రమంలో హాంకాంగ్ నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. గత కొన్నేళ్లలో ఈ దిగుమతులు వేగంగా పెరగడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి దేశంలో 6వ అతిపెద్ద దిగుమతి భాగస్వామిగా హాంకాంగ్ అవతరించింది. అయితే, హాంకాంగ్ నుంచి దిగుమతుల పెరుగుదలను కేంద్రం నిశితంగా గమనిస్తోందని, ఇది చైనా వ్యూహంలో భాగమనే సందేహం కలుగుతోందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. మునుపటి సంవత్సరంలో హాంకాంగ్ నుంచి భారత్‌కు రూ. 1.27 లక్ష కోట్ల దిగుమతులు జరిగాయి. వీటిలో ఎలక్ట్రానిక్స్, టెలికాం పరికరాలు, కంప్యూటర్ హార్డ్‌వేర్ పరికరాల విలువే రూ. 60 వేల కోట్లు ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో హాంకాంగ్ నుంచి భారత్‌కు జరిగిన దిగుమతుల విలువ సుమారు రూ. 80 వేల కోట్లతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో చాలా వేగంగా పెరుగుదల నమోదైంది. చైనాతో భారత్‌కు వాణిజ్య లోటు గత రెండేళ్లుగా తగ్గిపోతుండగా, 2019-20లో హాంకాంగ్‌తో వాణిజ్య లోటు సుమారు రూ. 45 వేల కోట్లుగా ఉంది. ఇది 2017-18 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 30 వేల కోట్లతో పోలిస్తే అధికం. హాంకాంగ్‌తో సహా అనే ఆసియా దేశాల నుంచి దిగుమతుల్లో పెరుగుదలను పరిశీలిస్తున్నామని ఓ అధికారి తెలిపారు.