పండ్లు తీపి… ధరలు చేదు

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పండ్ల ధరలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు అంతో ఇంతో మోతాదు రేటుకు లభించిన పండ్లు నిన్నటి నుంచి ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే కూరగాయల రేట్లు పెరిగి స్ట్రగుల్ అవుతున్న సామాన్య ప్రజలు.. ఈ కష్టకాలంలో పండ్ల ధరలు పెరగడంతో నర్వస్‌గా ఫీలవుతున్నారు. వారం క్రితం అగ్గువకే దొరికిన చికెన్… సీఎం కేసీఆర్ ప్రకటనతో కిలోకు రూ.200 చేరుకోగా, బత్తాయిలు, సంత్రాలు తినాలని మళ్లీ నిన్న ప్రకటన చేయడంతో వ్యాపారులు పండ్ల ధరలను అమాంతం […]

Update: 2020-03-30 23:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పండ్ల ధరలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు అంతో ఇంతో మోతాదు రేటుకు లభించిన పండ్లు నిన్నటి నుంచి ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే కూరగాయల రేట్లు పెరిగి స్ట్రగుల్ అవుతున్న సామాన్య ప్రజలు.. ఈ కష్టకాలంలో పండ్ల ధరలు పెరగడంతో నర్వస్‌గా ఫీలవుతున్నారు. వారం క్రితం అగ్గువకే దొరికిన చికెన్… సీఎం కేసీఆర్ ప్రకటనతో కిలోకు రూ.200 చేరుకోగా, బత్తాయిలు, సంత్రాలు తినాలని మళ్లీ నిన్న ప్రకటన చేయడంతో వ్యాపారులు పండ్ల ధరలను అమాంతం పెంచేశారు. దీంతో ఫ్రూట్ మార్కెట్‌కు వెళ్లిన కస్టమర్స్‌‌ ధరలు చూసి ఊహించని షాక్‌కు గురవుతున్నారు.

నిన్నటివరకు మార్కెట్లో పండ్ల ధరలు నార్మల్ పీపుల్స్ కొనుక్కొని తినేలా ఉండేవి. కానీ బత్తాయిలు, సంత్రాలు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేయడంతో ఉన్నట్టుండి వ్యాపారులు ధరలు పెంచేశారు. ఆదివారం రూ.60 ఉన్న కిలో ద్రాక్ష, సోమవారం నాడు రూ.110కి చేరింది. యాపిల్స్ సైతం రూ.100కు మూడు మాత్రమే ఇస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఇదివరకు ఈ పండ్లను రూ.100కు ఐదు వరకు ఇచ్చేవారు. అటు రూ.40 వరకు ఉన్న డజన్ అరటి పండ్లు ఇప్పుడు రూ.65 నుంచి 70వరకు అమ్ముతున్నారు. మార్కెట్లో ఫిరం లేనప్పటికీ ఎందుకింత ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే వెళ్లిపోండని మాట్లాడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి.

కొండెక్కిన సంత్రాలు.. రూ.100కు ఐదే

సంత్రాలు, బత్తాయిలు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందన్న ప్రచారంతో వ్యాపారులు ధరలు రెట్టింపు చేశారు. మొన్నటి వరకు రూ.వందకు పది వరకు ఇచ్చిన సంత్రాలను ఇప్పుడు నాలుగైదు మాత్రమే ఇస్తున్నారు. అటు దానిమ్మ కాయలను సైతం ఇదే రేటుకు అమ్ముతున్నారు. దానిమ్మ కాయలు చిన్నవి, పెద్దవి చూడకుండా వాళ్ల చేతికి వచ్చినవి నాలుగైదు ఇస్తూ అంతే సంగతులు అంటున్నారు. దీంతో జనాలు చేసేదేమీ లేక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్యూనిటీ పవర్ కోసం ఆరాట పడుతూ వ్యాపారులు నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేస్తున్నారు.

పుచ్చకాయ… గింజుకున్న ఇయ్యకపాయే !

ఫ్రూట్ మార్కెట్లో అన్ని పండ్ల ధరలు ఒక ఎత్తు అయితే పుచ్చకాయ ధరలు మరో ఎత్తు. అయితే పుచ్చకాయలకు ఎండకాలం సీజన్‌లో ఓరేంజ్‌లోనే ధర ఉంటుందనేది వాస్తవం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నంత రేటు ఇదివరకు ఎప్పుడూ మనం చూసిన దాఖలాలు లేవు. గతంలో రూ.50 నుంచి 100కే పెద్ద పుచ్చకాయలు అమ్మినవారు ఇప్పుడు రూ.200 నుంచి 250 వరకు విక్రయాలు చేపడుతున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో పాటు, సమ్మర్ సీజన్ నడుస్తుండటంతో ఎక్కువమంది పుచ్చకాయను లైక్ చేస్తుండటంతో వ్యాపారులు ఓ రేంజ్‌లో ధరలను పెంచేశారు. కరోనా పుణ్యమా అని కూరగాయల ధరలతో పాటు పండ్ల ధరలు పెరగడంతో ప్రజెంట్ క్రైసిస్ సిచ్వేషన్ ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ధర అయినా పండ్లను కొనుగోలు చేస్తున్నారు.

Tags: Increased Fruit Prices, Chicken, Mutton, CM KCR, Water Milan, Health, High Prices

Tags:    

Similar News