వరంగల్ లో కరోనా మరణ మృదంగం
దిశప్రతినిధి,వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా మరణ మృదంగం కొనసాగుతుంది. రోజూ వారిగా రెండు మూడు కరోనా మరణాలు సర్వ సాధారణమైపోయాయి. శనివారం ముగ్గురు కరోనాతో మరణించగా, ఆదివారం మధ్యాహ్నం నాటికే నాలుగు మరణాలు సంభవించాయి. ఇదే విషయంపై దిశ ప్రతినిధి ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డిని వివరణ కోరగా ఈ రోజులు నలుగురు మరణించిన మాట వాస్తవమేనని ధ్రువీకరించారు. రోజూ ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారని అన్నారు. అయితే ఎంజీఎంలో హెల్త్ బులిటెన్ ఎందుకు విడుదల చేయడం […]
దిశప్రతినిధి,వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా మరణ మృదంగం కొనసాగుతుంది. రోజూ వారిగా రెండు మూడు కరోనా మరణాలు సర్వ సాధారణమైపోయాయి. శనివారం ముగ్గురు కరోనాతో మరణించగా, ఆదివారం మధ్యాహ్నం నాటికే నాలుగు మరణాలు సంభవించాయి. ఇదే విషయంపై దిశ ప్రతినిధి ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డిని వివరణ కోరగా ఈ రోజులు నలుగురు మరణించిన మాట వాస్తవమేనని ధ్రువీకరించారు. రోజూ ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారని అన్నారు. అయితే ఎంజీఎంలో హెల్త్ బులిటెన్ ఎందుకు విడుదల చేయడం లేదన్న ప్రశ్నకు.. చేయడం లేదని.. డెత్‌ల వివరాలు వెల్లడించడం లేదని పేర్కొన్నారు.