ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా.. ఇవాళ కేసులెన్నంటే ?
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం తాజాగా గత 24 గంటల్లో 58,890 సాంపిల్స్‌ను పరీక్షించగా 1, 248 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,04,590కు చేరింది. అదే సమయంలో కరోనాతో 15 మంది మరణించగా..తాజా లెక్కల ప్రకారం కరోనాతో […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం తాజాగా గత 24 గంటల్లో 58,890 సాంపిల్స్‌ను పరీక్షించగా 1, 248 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,04,590కు చేరింది. అదే సమయంలో కరోనాతో 15 మంది మరణించగా..తాజా లెక్కల ప్రకారం కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,750కు పెరిగింది. ఇకపోతే నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1,715 మంది కరోనా నుంచి కోలుకోగా..మెుత్తం కోలుకున్న వారి సంఖ్య 19,77,163కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,677 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,61,98,824 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.