మా కథకు ముగింపు: రిషి కపూర్ సతీమణి

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ కన్నుమూత సినీ రంగానికి తీరని లోటు. ఆయనతో ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చాలు… ఆయనతో ఒక్కసారి మాట్లాడిన చాలు అని తపనపడే ఎంతో మంది నటులు ఆయన మరణవార్తతో దిగ్భ్రాంతి చెందారు. మరెందరో నటులు రిషి కపూర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎంత గొప్ప నటుడు, ఎంత మంచి మనిషి అని తెలుపుతూ సోషల్ మీడియా లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే రిషి […]

Update: 2020-05-02 02:53 GMT

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ కన్నుమూత సినీ రంగానికి తీరని లోటు. ఆయనతో ఒక్కసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చాలు… ఆయనతో ఒక్కసారి మాట్లాడిన చాలు అని తపనపడే ఎంతో మంది నటులు ఆయన మరణవార్తతో దిగ్భ్రాంతి చెందారు. మరెందరో నటులు రిషి కపూర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎంత గొప్ప నటుడు, ఎంత మంచి మనిషి అని తెలుపుతూ సోషల్ మీడియా లో తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

అయితే రిషి కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నీతూ కపూర్… కష్ట సుఖాల్లో తోడుంది. ఆయన ప్రేమను ప్రేమగా స్వీకరించిన నీతూ… కోపం, ద్వేషం కూడా ప్రేమగానే మలుచుకుంది. ఆ మూడుముళ్ల బంధానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ… ఏడడుగుల అనుబంధానికి ప్రాముఖ్యతనిస్తూ కడవరకు ఆయన అడుగుజాడలోనే నడిచింది. కానీ తను మాత్రం తనను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు. ఆ బంధం, అనుబంధానికి బై చెప్తూ .. మధ్యలోనే ఒంటరిదాన్ని చేసి కనుమరుగయ్యాడు. తన జీవితంలో అన్నీ తానై, ఎన్నో మధుర జ్ఞాపకాలకు ప్రతీక అయినా తనే లేకపోవడంతో…. మా కథకు ముగింపు అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టింది నీతూ. చేతిలో మందు గ్లాస్, ముఖంపై చెరగని చిరునవ్వుతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ… తనతోనే నా జీవిత కథ ముగిసిందని ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టింది.

ఈ పోస్ట్ పై ప్రముఖులు స్పందిస్తున్నారు. మీ కథ ముగియలేదు.. ఈ భూమి మీద మరెన్నో కథలకు స్ఫూర్తినిచ్చిందని..కొన్ని కథలకు ఎప్పుడూ ముగింపు ఉండదు.. మన హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతాయి .. రిషి కపూర్ ఎప్పటికీ మనల్ని గైడ్ చేసే దేవదూతగా ఉండిపోతారని బదులిస్తూ ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.


Tags: Rishi Kapoor, Neetu Singh, Bollywood, Ranbeer Kapoor, Riddima Kapoor

Tags:    

Similar News