రిషబ్ పంత్ అరుదైన రికార్డు
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన రికార్డు సృష్టించాడు. ఆసీస్‌లో వరుసగా 8 ఇన్నింగ్స్‌లో 25 అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించిన విదేశీ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్స్ బ్యాట్స్‌మాన్ వాలీ హేమండ్, విండిస్ బ్యాట్స్‌మాన్ వివియన్ రిచర్డ్స్ తర్వాత ఈ ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మాన్‌గా పంత్ నిలిచాడు. 2018లో భారత జాతీయ జట్టుకు ఎంపికైన రిషబ్ పంత్ అదే ఏడాది ఆస్ట్రేలియా […]
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన రికార్డు సృష్టించాడు. ఆసీస్‌లో వరుసగా 8 ఇన్నింగ్స్‌లో 25 అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించిన విదేశీ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్స్ బ్యాట్స్‌మాన్ వాలీ హేమండ్, విండిస్ బ్యాట్స్‌మాన్ వివియన్ రిచర్డ్స్ తర్వాత ఈ ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మాన్‌గా పంత్ నిలిచాడు. 2018లో భారత జాతీయ జట్టుకు ఎంపికైన రిషబ్ పంత్ అదే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. అప్పుడు 4 టెస్టులు ఆడిన పంత్ 7 ఇన్నింగ్స్‌లలో వరుసగా 25, 28, 36, 30, 39, 33, 159 పరుగులు చేశాడు. తొలి టెస్టులో చోటు దక్కని పంత్ రెండో టెస్టులో బరిలోకి దిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేశాడు. దీంతో వరుసగా 25+ పరుగులు చేసిన విదేశీ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పంత్ నిలిచాడు.