జోరు పెంచిన రిలయన్స్..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పునరుత్పాదక రంగంలోకి ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. జూన్‌లో జరిగిన సంస్థ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ కొత్త మెటీరియల్స్, పునరుత్పాదక ఇంధన వ్యాపారంలోకి వస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కొత్త కొనుగోళ్లను చేపడుతున్నారు. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా నేషనల్ కెమికల్ కార్పొరేషన్‌తో అనుబంధం ఉన్న ప్రముఖ సౌర మాడ్యూల్స్ తయారీ సంస్థ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పునరుత్పాదక రంగంలోకి ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. జూన్‌లో జరిగిన సంస్థ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ కొత్త మెటీరియల్స్, పునరుత్పాదక ఇంధన వ్యాపారంలోకి వస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కొత్త కొనుగోళ్లను చేపడుతున్నారు. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా నేషనల్ కెమికల్ కార్పొరేషన్‌తో అనుబంధం ఉన్న ప్రముఖ సౌర మాడ్యూల్స్ తయారీ సంస్థ ఆర్ఈసీ గ్రూప్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్ఐఎల్ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.
1-1.2 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 7,300-7.500 కోట్ల) విలువైన ఈ ఒప్పందం చివరి దశలో ఉందని సమాచారం. ఈ ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రూ. 3,600-4,000 కోట్ల వరకు నిధుల కోసం ఆర్ఐఎల్ చర్చలు జరుపుతోంది. ఈ కొనుగోలు పూర్తయితే రిలయన్స్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అంతర్జాతీయ ఉత్పాదక సామర్థ్యాలను సాధించేందుకు వీలవుతుంది. సౌర విభాగంలో మరింత దూకుడుగా కొనసాగే అవకాశం లభిస్తుంది.