మరో యూకే సంస్థను కొనుగోలు చేసిన రిలయన్స్

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యూకేకు చెందిన దిగ్గజ కంపెనీ స్టోక్ పార్క్‌ను కొనుగోలు చేసింది. హోటల్, గోల్ఫ్ కోర్స్ కలిగిన ఈ సంస్థను రిలయన్స్ సంస్థ 57 మిలియన్ పౌండ్ల(మన కరెన్సీలో సుమారు రూ. 590 కోట్లు)కు సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం తర్వాత భవిష్యత్తులో రిలయన్స్‌కు చెందిన హాస్పిటాలిటీ ఆస్తుల్లో స్టోక్ పార్క్ కూడా భాగం కానుంది. స్టోక్ పార్క్ సంస్థ యూకే మొట్టమొదటి కంట్రీ క్లబ్, […]

Update: 2021-04-23 04:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యూకేకు చెందిన దిగ్గజ కంపెనీ స్టోక్ పార్క్‌ను కొనుగోలు చేసింది. హోటల్, గోల్ఫ్ కోర్స్ కలిగిన ఈ సంస్థను రిలయన్స్ సంస్థ 57 మిలియన్ పౌండ్ల(మన కరెన్సీలో సుమారు రూ. 590 కోట్లు)కు సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం తర్వాత భవిష్యత్తులో రిలయన్స్‌కు చెందిన హాస్పిటాలిటీ ఆస్తుల్లో స్టోక్ పార్క్ కూడా భాగం కానుంది. స్టోక్ పార్క్ సంస్థ యూకే మొట్టమొదటి కంట్రీ క్లబ్, ఇంటర్నేషనల్ గ్రూప్, రెండోతరం బ్రిటీష్ కుటుంబానికి చెందినది. ఈ సంస్థకు పైన్‌వుడ్ స్టూడియోస్‌తో పాటు బ్రిటీష్ చిత్ర పరిశ్రమతో సంబంధాలున్నాయి.

కాగా, ఇంధన రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోను వ్యాపారాలను విస్తరించాలని భావిస్తున్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 2019లో బ్రిటన్‌కు చెందిన ఆటబొమ్మల కంపెనీ హమ్లిస్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా దేశీయ టాయ్స్ రంగంలో మెరుగైన అవకాశాలను సాధించవచ్చని రిలయన్స్ భావిస్తోంది.

Tags:    

Similar News