180మంది కార్మికులకు బియ్యం పంపిణీ
దిశ, వరంగల్: జనగామ జిల్లా రైల్వేస్టేషన్ పరిధిలో మున్సిపాలిటీ విభాగంలో పనిచేస్తున్న 180 మంది పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి 25 రోజులకు సరిపడా సన్నబియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అలాంటి విపత్కర సమయంలో పట్టణాలను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సాయం చేయడం గర్వంగా ఉందన్నారు. అత్యవసర సమయాల్లో కార్మికులు అందిస్తున్న సేవలను […]
దిశ, వరంగల్: జనగామ జిల్లా రైల్వేస్టేషన్ పరిధిలో మున్సిపాలిటీ విభాగంలో పనిచేస్తున్న 180 మంది పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి 25 రోజులకు సరిపడా సన్నబియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అలాంటి విపత్కర సమయంలో పట్టణాలను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సాయం చేయడం గర్వంగా ఉందన్నారు. అత్యవసర సమయాల్లో కార్మికులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని వెంటనే పర్మినెంట్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్నిడిమాండ్ చేసారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ ఎర్రమళ్ల సుధాకర్, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ వేముల సత్యనారాయణ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, నాయకులు పాండు, కౌన్సిలర్‌లు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags : municipal workers, corona, rice distribution, congress leader