సీపీఐ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ
దిశ, హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు, రోజువారీ కూలీలకు రోజుకో బస్తీలో ఉచితంగా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్టు సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ టీ నరసింహ తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలోని బేలా చౌరస్తాలో 200 మందికి ఉచితంగా బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా నిరుపేదలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వమే రెండు నెలల రేషన్‌తో పాటు […]
దిశ, హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు, రోజువారీ కూలీలకు రోజుకో బస్తీలో ఉచితంగా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్టు సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ టీ నరసింహ తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలోని బేలా చౌరస్తాలో 200 మందికి ఉచితంగా బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా నిరుపేదలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వమే రెండు నెలల రేషన్‌తో పాటు రూ. 5 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతగా సింగరేణి కాలనీ, నీలం రాజశేఖర్ రెడ్డి నగర్, సరళ దేవి నగర్ తదితర బస్తీల్లో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రమోహన్ గౌడ్, నాయకులు మహేష్, ఏఐటీయూసీ నాయకులు కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags: CPI, Rice Distribution, Lock down, Old city, Ration