ఆ సీక్రెట్ బయటపెట్టేసిన RGV .. ఈ సారి తెలంగాణ రక్తచరిత్ర అంటూ..
దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రాం గోపాల్ వర్మ ఇన్నిరోజులు ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని చూపించారు. అయితే, ఎప్పటి నుంచో విప్లవ వీరుడి కథను తీసేందుకు వెతుకుతున్న ఆర్జీవీ, వరంగల్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ లీడర్ కొండా మురళి, సురేఖల బయోపిక్ తీసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్టోరీని రెడీ చేసిన వర్మ అసలు కొండా దంపతుల సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారో చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఆర్జీవీ ఓన్ […]
దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రాం గోపాల్ వర్మ ఇన్నిరోజులు ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని చూపించారు. అయితే, ఎప్పటి నుంచో విప్లవ వీరుడి కథను తీసేందుకు వెతుకుతున్న ఆర్జీవీ, వరంగల్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ లీడర్ కొండా మురళి, సురేఖల బయోపిక్ తీసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్టోరీని రెడీ చేసిన వర్మ అసలు కొండా దంపతుల సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారో చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఆర్జీవీ ఓన్ వాయిస్ తో ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియో క్లిప్ లో .. ‘‘ నాకు మొన్న మొన్నటి వరకు కూడా తెలంగాణ సాయుధపోరాటం గురించి ఏమీ తెలియదు. ఈ మధ్య కలిసిన పోలీస్ ఆఫీసర్లు, మాజీ నక్సలైట్ల వల్ల కొంత అవగాహన వచ్చింది. అందులో ఎక్కువగా నన్ను ఆకర్షించింది ఎన్‌కౌంటర్ లో కాల్చబడిన రామకృష్ణ (ఆర్ కే) కు కొండా మురళీ కి ఉన్న సంబంధం. అప్పటి పరిస్థితులను సినిమాటిక్ గా చూపించేందుకు కొండా మురళిని కలిసి సహకరించాలని కోరాను. ఈ సినిమా తీయడానికి దీని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకొని ఆయన కూడా ఒప్పుకున్నారు. పెత్తం దారుల పెత్తనం భరించలేక కొంత మంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి. వాటిని అనిచి వేసేందుకు ఎంత ప్రయత్నించినా.. మురళీ, ఆర్కే ల వంటి నాయకత్వంలో తిరుగుబాటు చేసేవారు. విపరీత పరిస్థితుల నుంచి విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా.. అలాంటి పరిస్థితుల్లో పుట్టిన వారే కొండా మురళి, కొండా సురేఖ. నేను తీస్తున్నది సినిమా కాదు.. నమ్మశక్యం కాని నిజజీవితాల ఆధారంగా తెలంగాణలో జరిగిన రక్త చరిత్ర. 1980లో మొదలైన చరిత్ర కోరలు.. ఇప్పటి రాజకీయాలను కూడా కరుస్తూనే ఉన్నాయి. మున్ముందు రాజకీయాలను కూడా కరుస్తుంటాయ్. విప్లవం అనేది ఎప్పుడు మారదు.. దాని రూపు మార్చుకుంటుంది అంతే. కొండా చిత్రం షూటింగ్ పూర్తిగా వరంగల్, పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో జరగబోతోంది. మా చిత్ర విప్లవం అతి త్వరలో మొదలవబోతోంది.’’ అని ఉంది. ఈ ఆడియో క్లిప్ వింటే గూస్ బమ్స్ వస్తున్నాయని.. సినిమా కోసం వెయింటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.