ముస్లింలు తెలియక తప్పు చేస్తే.. హిందువులు తెలిసి చేశారు : ఆర్జీవీ
దిశ, సినిమా : వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ మోడీ గవర్నమెంట్‌ను ఒక్క ట్వీట్‌తో కడిగిపడేశాడు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 31 లక్షల మందితో బాహుబలి రేంజ్‌లో జరుగుతున్న కుంభమేళాను చూస్తుంటే, మార్చి 2020లో ఢిల్లీలోని మర్కజ్ మసీదులో దాదాపు 9 వేల మందితో కూడిన సామూహిక ప్రార్థనలు షార్ట్ ఫిల్మ్‌లా కనిపించాయని అన్నారు. ఈ నేపథ్యంలో హిందువులు అందరూ ముస్లింలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే అప్పుడు ముస్లిం సోదరులు కరోనా ప్రభావం తెలియక […]
దిశ, సినిమా : వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ మోడీ గవర్నమెంట్‌ను ఒక్క ట్వీట్‌తో కడిగిపడేశాడు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 31 లక్షల మందితో బాహుబలి రేంజ్‌లో జరుగుతున్న కుంభమేళాను చూస్తుంటే, మార్చి 2020లో ఢిల్లీలోని మర్కజ్ మసీదులో దాదాపు 9 వేల మందితో కూడిన సామూహిక ప్రార్థనలు షార్ట్ ఫిల్మ్‌లా కనిపించాయని అన్నారు. ఈ నేపథ్యంలో హిందువులు అందరూ ముస్లింలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే అప్పుడు ముస్లిం సోదరులు కరోనా ప్రభావం తెలియక తప్పు చేస్తే, ఇప్పుడు కరోనా ఎంత ప్రమాదకరమో తెలిసిన తర్వాత కూడా మనం అదే తప్పును రిపీట్ చేస్తున్నామన్నారు.
https://twitter.com/RGVzoomin/status/1381706234420551682?s=20
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న కుంభమేళాపై సెటైర్ వేసిన వర్మ.. 31 లక్షల మంది పవిత్ర పుణ్యస్నానం చేసినప్పుడు కేవలం 26 మందికే కరోనా పాజిటివ్ అని అధికారులు ప్రకటించడంపై.. ‘అయితే అసలు వర్రీ కావాల్సిన అవసరం లేదు, సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 17 లక్షల మంది ముంబై ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆరు వారాలు పడితే.. కేవలం ఒక్కరోజులోనే కుంభమేళాలో 37 లక్షల మంది పాల్గొనడం విచిత్రంగా ఉందన్నాడు. అంటే ప్రజలు ఈ జన్మ కన్నా వచ్చే జన్మపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ప్రూవ్ అవుతోందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.