ట్విస్ట్ ఇచ్చిన రాంగోపాల్ వర్మ

దిశ, వెబ్ డెస్క్: మరొకరి జీవితంలో జరిగిన రియల్ స్టోరీస్ ని తెరకెక్కిస్తూ సంచలనాలు సృష్టించే రాంగోపాల్ వర్మ ఈసారి రూటు మార్చారు. వాళ్ళదీ-వీళ్లదీ కాకుండా తన జీవిత కథనే సినిమాగా తీయబోతున్నారు. అది కూడా మూడు పార్టులుగా. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఒక పార్టులో స్వయంగా ఆయనే నటించబోతున్నారు. ఈ వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు వర్మ. బొమ్మాకు  క్రియేషన్స్ సంస్థ నా  నిజ జీవితాన్ని 3 భాగాలు, అంటే  3 చిత్రాలుగా నిర్మించబోతోంది. “దొరసాయి […]

Update: 2020-08-25 10:13 GMT

దిశ, వెబ్ డెస్క్: మరొకరి జీవితంలో జరిగిన రియల్ స్టోరీస్ ని తెరకెక్కిస్తూ సంచలనాలు సృష్టించే రాంగోపాల్ వర్మ ఈసారి రూటు మార్చారు. వాళ్ళదీ-వీళ్లదీ కాకుండా తన జీవిత కథనే సినిమాగా తీయబోతున్నారు. అది కూడా మూడు పార్టులుగా. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఒక పార్టులో స్వయంగా ఆయనే నటించబోతున్నారు. ఈ వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు వర్మ.

బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ నా నిజ జీవితాన్ని 3 భాగాలు, అంటే 3 చిత్రాలుగా నిర్మించబోతోంది. “దొరసాయి తేజ” ఈ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నాడు. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలవనుంది. నా బయోపిక్ 3 చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు 2 గంటలుంటుంది అంటే 3 చిత్రాలు కలిపి 6 గంటలు అని చెప్పుకొచ్చారు.

3 పార్టుల్లో, ఒక్కొక్క పార్టు నా వేరు వేరు వయసుల్లో వేరు వేరు అంశాలను చూపెట్టబోతోంది. పార్ట్ 1 లో నా 20 ఏళ్ళప్పుడు రోల్ ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 లో వేరే నటుడు, పార్ట్ 3 లో నేనే నా గా నటించబోతున్నా అని తెలిపారు.

పార్ట్ 1 “రాము” – దీంట్లో నా కాలేజ్ రోజులు, తొలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నానన్నది ఉంటుందన్నారు.

పార్ట్ 2 “రామ్ గోపాల్ వర్మ” -అండర్ వరల్డ్ తో ప్రేమాయణం – ఇది నా ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్, అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి ఉంటుంది.

పార్ట్ 3 “RGV” -ది ఇంటెలిజెంట్ ఇడియట్ – ఇది నా ఫెయిల్యూర్లు, వివాదాలు, దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల, సమాజం పట్ల నాకున్న విపరీత వైఖరుల గురించి ఉంటుందని వెల్లడించారు.

Tags:    

Similar News